Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 12 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 12 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 12 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి సా.6-24 తదుపరి త్రయోదశి | హస్త నక్షత్రం రా.12-04 తదుపరి చిత్త | వర్జ్యం ఉ.9-25 నుంచి 10-56 వరకు | అమృత ఘడియలు సా.6-26 నుంచి 7-56 వరకు | దుర్ముహూర్తం ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృషభం: పనుల్లో ప్రతిష్ఠంభన. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: పరపతి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కర్కాటకం: ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త పోస్టులు.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కన్య: అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. విద్యార్థులకు ఒత్తిడులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యావకాశాలు దక్కుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఒప్పందాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

ధనుస్సు: చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉండవచ్చు.

మకరం: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూల పరిస్థితి.

కుంభం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మీనం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories