Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశివారు శుభవార్తలు వింటారు

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam
x

Daily Horoscope

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు.

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| సోమవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.50 | సూర్యాస్తమయం సా.6.11| తిథి అమావాస్య ఉ.గం.6.58 వరకు| తదుపరి పాడ్యమి |నక్షత్రం రేవతి ప.10.38| వర్జ్యం లేదు| దుర్ముహూర్తం ప.12.24 నుంచి 1.13 వరకు తదుపరి మ.02.53 నుంచి 03.43 వరకు| అమృతఘడియలు ఉ.08.02 తదుపరి తె. 5.05 వరకు| కరణం నాగవం ఉ.6.58| యోగం వైదృతి ప.1.46 వరకు|

ఈ రోజు రాశిఫలాలు

మేష రాశి : ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కళాకారులు కీలక సమాచారం అందుకుంటారు.

వృషభ రాశి: శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామికవేత్తలకు చికాకులు తప్పవు.

మిథున రాశి: కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరాశ. కళాకారులకు సమస్యలు.

కర్కాటక రాశి: గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు.

సింహం రాశి: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరతాయి.

కన్యా రాశి: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. రాజకీయవేత్తలకు గందరగోళంగా ఉంటుంది.

తుల రాశి: శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. మిత్రులు, సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవేత్తలకు కొత్త సమస్యలు.

వృశ్చిక రాశి: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కళాకారులకు శుభవార్తలు.

ధనుస్సు రాశి: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలకు శ్రమాధిక్యం.

మకర రాశి: ఇంటర్వ్యూలు అందుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

కుంభ రాశి:రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మీన రాశి:నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో విశేష ఆదరణ. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories