Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 11 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 11 పంచాంగం, దినఫలాలు!
X
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 11 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి రా.8-33 తదుపరి ద్వాదశి | ఉత్తర నక్షత్రం రా.1-33 తదుపరి హస్త | వర్జ్యం ఉ.9-39 నుంచి 11-10 వరకు | అమృత ఘడియలు సా.6-44 నుంచి 8-15 వరకు | దుర్ముహూర్తంమ.12-06 నుంచి 12-51 వరకు తిరిగి మ.2-22 నుంచి 3-07 వరకు | రాహుకాలం ఉ.11-21 నుంచి 12-06 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-22

ఈరోజు రాశి ఫలాలు


మేషం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో ఆదరణ. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం: ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మిథునం: వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు. విందువినోదాలు.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

తుల: శుభకార్యాల రీత్యా ఖర్చులు. అదనపు ఆదాయం. విందువినోదాలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు: పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పకపోవచ్చు.

మకరం: కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎదురవుతాయి.

కుంభం: పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితి

Web Titledaily-horoscope-in-telugu-rasi-phalalu-panchangam-dinaphalaalu-today-11th-November
Next Story