Daily Horoscope:ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే

Kranthi
Published on: 11 May 2021 6:09 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today  11th May
X

Daily Horoscope:(File Image) 

నేటి రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈరాశి వారికి ప్రస్తుతం కాలం అంత అనుకూలంగా లేదు కానీ, ఆర్థికంగా కొంత ప్రయోజనం కలుగుతుంది. సమస్యల పరిష్కారానికి విపరీతంగా ఆలోచించి మనశ్శాంతి పోగొట్టుకోవద్దు. అందరినీ కలుపుకొని వెళ్తే మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం ప్రయోజనకరం.

వృఫభరాశి: ఈ రాశి వారు ఏ పని చేసినా ఆలోచించి చేయాల్సలి వుంటుంది. ఫలితాలు అనుకూలంగా వుంటాయి.ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. సహోద్యోగుల సహకారం కూడా తీసుకోండి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి.

మిథున రాశి: ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నంతో పాటు ధన లాభం కూడా వుంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులు, ఆప్తుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఇరుగు పొరుగువారితో వివాదాలకు దిగవద్దు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి తలచిన పనులు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. గృహ, వాహన యోగాల మీద దృష్టి పెడతారు.

సింహ రాశి: ఈ రాశి వారు ఉద్యోగ విధుల్లో జాగ్రత్తగా మసులుకోవాలి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి తప్పదు. ఆదాయానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటి సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వివాహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

తులా రాశి: ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా ఫలిస్తాయి. సరైన ఆలోచనా విధానంతో ముందడుగు వేయండి. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజానికి పనికి వచ్చే పనులు చేపడతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలకు ఆస్కారముంది. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీవైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రతగా వుండాల్సి వుంటుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు అధికారుల మెప్పుతో అనుకున్నది సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని అవాంతరాలు ఉన్నా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. దగ్గరి బంధువుతో విభేదాలకు అవకాశం ఉంది. శక్తికి మించి శ్రమ పడి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

మకర రాశి: ఈ రాశివారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొన్ని పనులు పూర్తి చేసి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే ఆలోచన చేస్తారు.

కుంభ రాశి: ఈ రాశి వారికి వివాహానికి శుభ సమయం ఇది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. శత్రువు మిత్రువు అవుతారు. శుభవార్త వింటారు. విద్యార్థులు శ్రమ పడక తప్పదు.

మీన రాశి: ఈ రాశి వారికి ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. అధికారం చేపట్టే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త ఆదాయ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story