Daily Horoscope: ఈ రాశి వారికి వ్యాపారాల్లో ఊహించని లాభాలు

Daily Horoscope: ఈ రాశి వారికి వ్యాపారాల్లో ఊహించని లాభాలు
x
Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope:బుధవారం| మార్చి 10-03-2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం| ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసం| తిథి తిల ద్వాదశి సా.గం.3.19 వరకు| తదుపరి త్రయోదశి |నక్షత్రం శ్రవణం రా.9.38 వరకు| తదుపరి ధనిష్ఠ| వర్జ్యం రా.1.39 నుంచి 3.15 వరకు| దుర్ముహూర్తం ప.11.45 నుంచి 12.33 వరకు| అమృతఘడియలు ప.11.25 |యమగండం ఉ.7.20 నుంచి 9.00 వరకు|కరణం తైతుల సా.3.19| యోగం పరిఘ ప.గం.1.42 వరకు| సూర్యోదయం : 6.15 | సూర్యాస్తమయం సా.6.04| రాహుకాలం : ప. 12.00 నుంచి 1:30 వరకు| శుభసమయం ప.11.30|

ఈ రోజు రాశి ఫలాలు

మేష రాశి: పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృషభ రాశి: పనుల్లో స్వల్ప అవాంతరాలు. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. శ్రమ తప్పదు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి. దైవచింతన.

మిథున రాశి: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటక రాశి: ఇంట్లో శుభకార్యాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత పురోగతి.

సింహ రాశి: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కన్యా రాశి: రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో విశేష గౌరవం. దైవచింతన. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితి.

తులా రాశి: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చిక రాశి: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

ధనుస్సు రాశి: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకర రాశి: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభ రాశి: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

మీన రాశి: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories