Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Kranthi
Updated on: 10 Jun 2021 6:52 AM IST
Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 10th June
X

Daily Horoscope:(File Image)

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| గురువారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు ఏదైనా పని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండండి. చట్టపరమైన వివాదాల్లో ఇరుక్కునే అవకాశం వుంది. అకస్మాత్తుగా అతిథులు రావడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. చాలాకాలంగా పట్టి పీడిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిషారం అవుతుంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. పెట్టుబడుల విషయం లో అననుకూల ఫలితాలు. కుటుంబ సభ్యులతో ఆనంగంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు వ్యాపారం కోసం నూతన ప్రణాళికలు రూపొందించుకుంటారు. రుణాలు తీర్చడం ద్వారా లాభాలు పొందుతారు. పిల్లల వైపు నుంచి పూర్తి ఆనందం, సహకారం పొందుతారు. భౌతిక వనరులపై ఖర్చు చేస్తారు. ఈ రోజు మీరు నూతన విషయాన్ని నేర్చుకునే అవకాశముంటుంది.

కర్కాటకరాశి: ఈరాశి వారు ఈ రోజు బంధువులు, సహోద్యోగులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికంగా వుంటాయి. మీకు ఇష్టమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు స్నేహితుల సహాయంతో పని ప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలతో తీసుకున్న నిర్ణయాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మనస్సులో భగవంతుని నామస్మరణ చేయడం వల్ల మీకు శుభకరంగా ఉంటుంది. మీ ప్రయత్నం వల్ల మీలో విశ్వాసం పెరుగుతాయి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనవసరమైన వివాదాలు, తగాదాల నుంచి బయటపడతారు. మీ ఖర్చులను తగ్గించడం ద్వారా మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంతేకాకుండా మీరు వాహనం ద్వారా ఆనందం పొందుతారు. ఈ రోజు మీ పని పూర్తయినందుకు సంతోషంగా ఉంటారు.

తులా రాశి: ఈ రాశివారికి ఈ రోజు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. డబ్బు సంపాదించండ ద్వారా మీ నిధులు పెరుగుతాయి. వత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ హక్కులు పెరుగుతాయి. పోటీ పరీక్షలో విద్యార్థులు విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పని పూర్తిచేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఇంటి నుంచే పనిచేస్తుంటే అన్ని కార్యాల్లో ప్రయోజనం పొందుతారు. భవిష్యత్తులో మీరు లాభం అందుకుంటారు. అనవసర విషయాలను పట్టించుకోకపోవడం మంచిది.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు మనస్సును కేంద్రీకరించడం ద్వారా అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. అందులో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారం కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు మీకు ప్రయోజనాలు ఇస్తాయి. సోదరీసోదరీమణుల నుంచి మద్దతు లభిస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ముందు అన్ని అంశాలను తనిఖీ చేయండి. బలం పెరిగే సంకేతాలు ఉన్నాయి. మీ వాగ్ధాటితో కళాత్మక నైపుణ్యాలతో మీరు ఇప్పుడు ఉద్దేశాలను అడ్డుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి నిర్మాణ పనుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఈ సమయంలో మీరు ఖర్చు విషయంలో నియంత్రణ కలిగి ఉండాలి. భవిష్యత్తులో కొంత డబ్బు ఆదా చేయాలి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల వైపు ఆసక్తి చూపుతారు.

మీన రాశి: ఈ రాశి ఈ రోజు స్నేహితులు, బంధువులు నుంచి ఏదైనా శుభవార్త అందుకుంటారు. మనస్సులో మీరు సంతోషంగా ఉంటారు. వ్యాపార పరంగా మీకు అనుకూలమైన లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జలుబు, దగ్గుకు దూరంగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Kranthi

Kranthi

Next Story