Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారికి ఉద్యోగ,వ్యాపారాల్లో చక్కని అవకాశాలు అందివస్తాయి.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 10th July
x

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే...

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో అననుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. మిత్రుల సహాయ సహకారంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం కనిపిస్తోంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతారు. ఆర్థికంగా బాగుటుంది. ఎవ్వరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం వుంది. కుటుంబ సమస్యల పరిష్కారానికి దృష్టి పెడతారు. అనవసరంగా అప్పులు చేసే అవకాశం కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఈ రోజు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పనులు చేపడితే అన్నింట్లో విజయం సాధిస్తారు. కార్యాలయంలో అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.

కర్కాటకరాశి: ఈరాశి వారికి ఈ రోజు ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత శ్రమ ఎక్కువవుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా వృద్ధికి అవకాశం ఉంది. కానీ ఖర్చులు అధికంగా వుంటాయి జాగ్రత్త. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. వ్యాపారం చాలావరకు నిలకడగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో అవరోధాలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

తులరాశి: ఈరాశి వారికి ఈరోజు రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. పోయిన వస్తువులు తిరిగి వస్తాయి. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వ్యాపారంలో కలిసి వస్తుంది. అన్ని విధాలా విశేష లాభాలున్నాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. కుటుంబంలో ఒక కీలక సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం పెంచుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. కుటుంబపరంగా కాస్తంత మేలు జరుగుతుంది. గట్టి పట్టుదలతో పనులు పూర్తి చేసుకుంటారు.

ధనస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కని అవకాశాలు అందివస్తాయి. అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దూర ప్రాంతంలో ఉన్న ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ముందడుగు వేస్తారు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురైనా తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. మీరు కోరుకున్న చోట ఉద్యోగం లభించే సూచనలున్నాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కొద్దిగా ఆలస్యంగా అయినా మీ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రతిభా పాటవాలతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ప్రమోషన్‌కు వీలుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు చేపట్టవచ్చు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వ్యాపారంలో కొంత మంచి జరుగుతుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories