Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 09 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 09 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 09 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | సప్తమి (రా.9-31వరకు) తదుపరి అష్టమి, | కృత్తిక నక్షత్రం (ఉ. 8-34వరకు) తదుపరి రోహిణి | అమృత ఘడియలు ఉ. 5-56 నుంచి 7-41 వరకు | వర్జ్యం రా. 1-50 నుంచి 3-34 వరకు | దుర్ముహూర్తం: ఉ. 11-33 నుంచి 12-22 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-06

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

మిథునం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ప్రముఖుల పరిచయం.

కర్కాటకం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాట మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

సింహం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల యత్నాలు నిదానిస్తాయి.

తుల: వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం.

వృశ్చికం: కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు ఒత్తిడులు.

ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

మకరం: దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది.

కుంభం: ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ గుర్తింపు. యత్నకార్యసిద్ధి. వ్యవహార విజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం: ఉద్యోగ యత్నాలు సానుకూలం. కొత్త పరిచయాలు. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. వస్తులాభాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories