Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 09 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 09 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 09 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి ఉ.12-22 వరకు తదుపరి షష్టి | ఆర్ద్ర నక్షత్రం రా.08-24 వరకు తదుపరి పునర్వసు | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు ఉ.09-56 నుంచి 10-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

వృషభం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి ఒప్పందాలు. ఆధ్యాత్మికచింతన. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

సింహం: కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

కన్య: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

తుల: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు..

వృశ్చికం: బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. పనులలో అవాంతరాలు. రుణభారాలు. వైద్యసేవలు. కొన్ని నిర్ణయాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

దనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మకరం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. స్థిరాస్తి వృద్ధి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల పరిష్కారం.

కుంభం: పనుల్లో ప్రతిష్ఠంభన. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వైద్యసేవలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

Show Full Article
Print Article
Next Story
More Stories