Daily Horoscope: ఈరోజు మీరోజు! జనవరి 07 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! జనవరి 07 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 07 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | కృష్ణపక్షం | ఏకాదశి - 24:00:07 (జనవరి 8 తె:00:00:07) వరకు తదుపరి ద్వాదశి | చిత్త నక్షత్రం - 15:46:26 వరకు తదుపరి స్వాతి | వర్జ్యం 110:30:54 నుండి 11:15:28 వరకు | అమృత ఘడియలు 12:00:02 నుండి 12:44:37 వరకు | దుర్ముహూర్తం 10:30:54 నుండి 11:15:28, 14:58:19 నుండి 15:42:53 వరకు | రాహుకాలం 13:45:53 నుండి 15:09:27 వరకు | సూర్యోదయం: ఉ.06-45 | సూర్యాస్తమయం: సా.05-51

ఈరోజు రాశిఫలాలు

మేషం: పనులు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. వైద్యసలహాలు పొందుతారు. తీర్థయాత్రలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

వృషభం: కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: నేర్పుగా వ్యవహరిస్తారు. అనుకున్న పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం: ఉద్యోగలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తులకు పదోన్నతులు.

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్యం, వైద్యసలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం, పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తొలగుతాయి.

వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగ సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. చేపట్టిన పనులలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.

మకరం: నేర్పుగా వ్యవహరించండి. అనుకున్న వ్యవహారాలు కొంత మందగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా కొంత నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి, ధనలాభాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories