Daily Horoscope:ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

Daily Horoscope:ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి
x
Highlights

Daily Horoscope:ఈ రోజు వివిధ రాశుల వారి దిన ఫ‌లాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| వ‌సంత‌ ఋతువు వైశాఖ‌ మాసం| ఉత్తరాయణం సోమ‌వారం,| సూర్యోదయం : 5.28 | సూర్యాస్తమయం సా.6.26| తిథి బ‌.ద్వాద‌శి ఉ.గం.09.18వరకు | తదుపరి త్ర‌యోద‌శి |నక్షత్రం భ‌ర‌ణి పూర్తి మంగ‌ళ‌వారం.5.55 వరకు| తదుపరి కృతిక‌|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం ప‌.2.08 నుంచి 3.45 వరకు| దుర్ముహూర్తం ప.12.25 నుంచి 1.17 పున: మ.3.01 నుంచి మ.3.53 వరకు| అమృతఘడియలు రా.12.40 నుంచి 03.49 వ‌ర‌కు

ఈ రోజు రాశిఫ‌లాలు

మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

వృషభం: సన్నిహితుల నుంచి సమస్యలు. ప్రయాణాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ధనవ్యయం.

మిథునం:ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వస్తు, వస్త్రలాభాలు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

సింహం: మిత్రులు, కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. కొన్ని పనులలో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య:ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

తుల: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త పనులు వాయిదా వేస్తారు. సోదరులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభ సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. కాంట్రాక్టులు లభిస్తాయి.

మకరం:వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పనులలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మరింత అనుకూలత. వస్తులాభాలు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

Show Full Article
Print Article
Next Story
More Stories