Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 05 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 05 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 05 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థిక ప్రగతి. పనులు చకచకా సాగుతాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం: సన్నిహితులతో సఖ్యత. కొన్ని సమస్యలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పనుల్లో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: అనుకున్న పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

తుల: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పోటీపరీక్షల్లో విజయం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.

ధనుస్సు: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మకరం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కుంభం: మిత్రుల నుంచి ఆహ్వానాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories