Daily Horoscope: ఈరోజు మీరోజు! జనవరి 05 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! జనవరి 05 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 05 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | కృష్ణపక్షం | నవమి - 28:05:42 (జనవరి 6 తె:04:05:42) వరకు తదుపరి దశమి | ఉత్తర ఫాల్గుణి నక్షత్రం - 18:20:48 వరకు తదుపరి హస్త | వర్జ్యం 07:32:02 నుండి 08:16:33 వరకు | అమృత ఘడియలు 11:59:11 నుండి 12:43:42 వరకు | దుర్ముహూర్తం 09:01:05 నుండి 09:45:36 వరకు | రాహుకాలం 15:08:24 నుండి 16:31:53 వరకు | సూర్యోదయం: ఉ.06-45 | సూర్యాస్తమయం: సా.05-51

ఈరోజు రాశిఫలాలు

మేషం: ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు నిరాశ. ధార్మిక చింతన.

వృషభం: ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు ఊరట.

మిథునం: ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం: కొత్తగా రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు కాస్త మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన ప్రగతి కనిపించదు.

సింహం: కాంట్రాక్టర్లకు నిరాశ తప్పదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో విభేదాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కన్య: కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. పాతమిత్రులను కలుసుకుంటారు. యుక్తితో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారాలు‡, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. వస్తులాభాలు.

తుల: కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి..

వృశ్చికం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వాహనయోగం.

ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి.

మకరం: విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో సమర్థత చాటుకుంటారు. దైవదర్శనాలు.

కుంభం: చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్య పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు.

మీనం: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు.

Show Full Article
Print Article
Next Story
More Stories