Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 03 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 03 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 03 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ: తె.05-06 వరకు తదుపరి తదియ | రేవతి ఉ.08-11 వరకు తదుపరి అశ్వని | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: రా.02-49 నుంచి 04-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆలయ దర్శనాలు.

వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. నూతన విద్యావకాశాలు. అరుదైన సత్కారాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

మిథునం: విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. భూ, గృహయోగాలు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళపరిస్థితి.

సింహం: అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు.

కన్య: ఉద్యోగయత్నాలలో పురోగతి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపురాబడి. వ్యూహాలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు అనుకున్నదిసాధిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

ధనుస్సు: అనుకోని ధనవ్యయం. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు.

కుంభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories