Daily Horoscope: ఈరోజు మీరోజు! జనవరి 03 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! జనవరి 03 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 03 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | కృష్ణపక్షం | చవితి - 08:24:13 వరకు తదుపరి పంచమి | మఘ నక్షత్రం - 20:17:01 వరకు తదుపరి పుబ్బ | వర్జ్యం 10:29:19 నుండి 11:13:48 వరకు | అమృత ఘడియలు 11:58:17 నుండి 12:42:46 వరకు | దుర్ముహూర్తం 16:25:11 నుండి 17:09:40 వరకు | రాహుకాలం 16:30:45 నుండి 17:54:09 వరకు | సూర్యోదయం: ఉ.06-45 | సూర్యాస్తమయం: సా.05-51

ఈరోజు రాశిఫలాలు

మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదురవుతాయి.

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వస్తు, వస్త్రలాభాలు. ధనలబ్ధి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు.

కర్కాటకం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత భారంగా ఉంటాయి.

సింహం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

తుల: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

ధనుస్సు: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు సాఫీగా సాగుతాయి. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

కుంభం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మీనం: విచిత్ర సంఘటనలు. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories