Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆర్ధికంగా మెరుగ్గా ఉంటుంది

Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆర్ధికంగా మెరుగ్గా ఉంటుంది
Daily Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆర్ధికంగా మెరుగ్గా ఉంటుంది
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు; మాఘ మాసం; శుక్ల పక్షం విదియ: ఉ. 8.38 తదుపరి తదియ శతభిషం: రా. 7.29 తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం: రా. 1.50 నుంచి 3.26 వరకు అమృత ఘడియలు: మ.12.26 నుంచి 2.00వరకు దుర్ముహూర్తం: ఉ.10.21 నుంచి 11.06 వరకు తిరిగి మ.2.51 నుంచి 3.36 వరకు రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం: ఉ.6.36, సూర్యాస్తమయం: సా.5.52
మేష రాశి: ఈ రాశి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మిత్రులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారులకు అనుకూలం సమయం. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. బంధువుల సహాయంతో పెళ్లి సంబందం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మిథున రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి శ్రమకు గురవుతారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారికి ఈ రోజు ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్లో నష్టపోతారు. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.
సింహ రాశి: ఈ రాశి వారు ఈరోజు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్నట్టుగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి: ఈ రాశివారికి ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
తులా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు మీ సలహాలు నచ్చుతాయి. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
ధనుస్సు రాశి: ఈరాశి వారు ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది.
మకర రాశి: ఈ రాశి ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉంటుంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కానీ, బాగా ఖర్చవుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
నిను మరువలేం.. తోబుట్టువుపై ప్రేమకు నిలువెత్తు నిదర్శనం
12 Aug 2022 11:45 AM GMTPM Kisan: రైతులకి అలర్ట్.. మరో 20 రోజుల్లో 12వ విడత డబ్బులు..!
12 Aug 2022 11:30 AM GMTHealth Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్లని డైట్లో...
12 Aug 2022 10:30 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMT