Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 02 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 02 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 02 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ రా.11-01 తదుపరి తదియ | కృత్తిక నక్షత్రం రా.10-50 తదుపరి రోహిణి | వర్జ్యం ఉ.9-38 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు రా.8-11 నుంచి 9-56 వరకు | దుర్ముహూర్తం మ.12-06 నుంచి 12-52 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-09 వరకు | రాహుకాలం ఉ.7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: పనుల్లో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. మిత్రుల సహాయం అందుతుంది. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగాలు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

సింహం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కన్య: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

వృశ్చికం: పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొంత గందరగోళం. ధనవ్యయం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

మకరం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కొన్ని పనులు చివరిలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. దూరపుబంధువుల కలయిక. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.

మీనం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories