Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu Today 02 02 2022
x

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం

Highlights

Daily Horoscope: ఈ రోజు మీ రోజు! నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు; మాఘ మాసం; శుక్ల పక్షం పాడ్యమి: ఉ. 10.03 తదుపరి విదియ ధనిష్ఠ: రా. 8.02 తదుపరి శతభిషం వర్జ్యం: తె.వ. 3.04 నుంచి 4.38 వరకు అమృత ఘడియలు: ఉ.10.02 నుంచి 11.34వరకు దుర్ముహూర్తం: ఉ.11.51 నుంచి 12.36 వరకు రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.6.36, సూర్యాస్తమయం: సా.5.51 చంద్ర దర్శనం

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ సామర్థ్యం మెరుగుదల ఉంటుంది. ఈ కారణంగా నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. కుటుంబ వివాదాలు నెలకొంటాయి. ఈ రోజు మీపై అధికారి సహాయంతో పరిష్కరించబడుతుంద. అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు నూతన ఒప్పందాలకు అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో సంక్లిష్టతలు ముగుస్తాయి. మీ వ్యూహం, సాధనతో ప్రతిదీ సాధిస్తారు. ప్రేమ జీవితంలో సంతోషకరమైన సమయం ఉంటుంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది.

కర్కాటకరాశి: ఈరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఉత్సాహం పెంపొందుతుంది. వ్యాపార సంబంధాల్లో విజయం సాధిస్తారు. తండ్రి మార్గదర్శకత్వం నుంచి మద్దతు పొందుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో కుటుంబంలో అవరోధాలు ఇబ్బందులను కలిగిస్తాయి.

సింహ రాశి: ఈ రాశివారికి కుటుంబంలో ఆస్తి వివాదాలు ఉంటాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా కనిపిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై గౌరవం ఉంటుంద. గొప్ప వ్యక్తిత్వాన్ని చూడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కార్యాలయంలో మీరు బలాన్ని పొందుతారు.

కన్యా రాశి: మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దూరపు ప్రయాణాలకు వీలయినంత దూరంగా ఉండటం మంచిది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఆర్ధికంగా దృడంగా అవుతారు. అనవసర విషయాలకు బాధపడటం మాని సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించండి.

తులా రాశి: ఈ రోజు ఈ రాశి వారు భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కార్యాలయంలో అనవసరమైన సందేహాలు, వాదనల్లో డబ్బు కోల్పోవచ్చు. కాబట్టి మీ పనిని సరిగ్గా చేయండి. తండ్రి వైపు నుంచి లాభం వస్తుందనే ఆశ ఉంటుంది. స్నేహితులతో మాట్లాడటం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం సూచిస్తోంది జాగ్రత్తగా వుండాలి. అనవసర ఖర్చుల జోలికి వెళ్లవద్దు. స్నేహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వైవాహిక సంబంధంలో పూర్తి సహకారాన్ని, నమ్మకాన్ని అనుభవిస్తారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఒకరితో వివాదం కారణంగా మీ ప్రవర్తనలో మార్పు ఉండవచ్చు. విదేశాలకు సంబంధించిన పనుల్లో విజయం లభిస్తుంది. ప్రేమ జీవితంలో గౌరవం పెరుగుతుంది.

మకర రాశి: ఈరాశి వారికి జీవిత భాగస్వామి సలహా కార్యాలయంలో సహాయకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. ఈ రోజు మీరు బిజీగా ఉండండి కష్టపడి పనిచేసిన తర్వాత లాభావకాశాలు ఉంటాయి. ఈ రోజు మీరు అసంపూర్తిగా ఉన్న ఇంటి పనులను పరిష్కరించుకోవాలి. వ్యాపారంలో లాభాల కోసం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

కుంభ రాశి: ఈ రాశి వారికి రాజకీయాలకు సంబంధించి ప్రజలకు మంచి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. మీరు మీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఉండవచ్చు. పొరుగువారి కారణంగా కొన్ని వ్యాపార సమస్యలు ఉండవచ్చు. మానసిక గందరగోళం పెరుగుతుంది.

మీన రాశి: ఈ రాశి వారు మానసిక, శారీరక సమస్యలను ఎదురుకుంటారు. ఎల్లవేళలా కార్యాలయానికి ఆలస్యంగా వెళ్ళడం వలన మీ పై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని తక్కువగా వెచ్చించి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. తోటీ ఉద్యోగుల సలహాలు తీసుకోవడం వలన భవిష్యత్తులో లాభం చేకూరుతుంది. పెద్దలను గౌరవించండి. అనవసర విషయాలకు బాధపడటం మాని సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories