Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 01 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! అక్టోబర్ 01 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 01 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పౌర్ణిమ: రా.01-05 వరకు తదుపరి | ఉత్తరాభాద్ర నక్షత్రం తె.05-39వరకు తదుపరి | వర్జ్యం: మ.01-56 నుంచి 03-41వరకు | అమృత ఘడియలు: రా.12-24నుంచి 02-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి మ. 02-28 నుంచి 03.15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. ఇంటర్వ్యూలు అందుతాయి వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వ సూలవుతాయి. స్థిరాస్తివృద్ధి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

కర్కాటకం: సన్నిహితులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో ఆటంకాలు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కన్య: రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

తుల: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలలో అనూహ్య లాభాలు. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. ఆస్తుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనయోగం.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధి క్యం.వ్యాపార లావాదేవీలలో నిరాశ. ఉ ద్యోగాలలో బాధ్యతలు అధికమవుతాయి.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలోమరింత ఉన్నతి.

కుంభం: విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

Show Full Article
Print Article
Next Story
More Stories