Vastu: ఇంట్లో చిలుకను పెంచుకుంటున్నారా.. అయితే, ఈ 3 విషయాలపై ఫోకస్ పెంచండి.. లేదంటే లైఫంతా రిస్కే..!

Are you Keeping a Parrot at Home Then Focus on These 3 Things Otherwise Life at Risk Check Vastu Shastra
x

Vastu: ఇంట్లో చిలుకను పెంచుకుంటున్నారా.. అయితే, ఈ 3 విషయాలపై ఫోకస్ పెంచండి.. లేదంటే లైఫంతా రిస్కే..!

Highlights

Parrot at Home: ప్రకృతి ఈ భూమిపై చాలా అందమైన జీవులను సృష్టించింది. వాటిలో కొన్ని జీవులతో మనుషులు స్నేహం చేస్తుంటారు.

Parrot at Home: ప్రకృతి ఈ భూమిపై చాలా అందమైన జీవులను సృష్టించింది. వాటిలో కొన్ని జీవులతో మనుషులు స్నేహం చేస్తుంటారు. ముఖ్యంగా కుక్కలు పెంచుకోవడం అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. అదే సమయంలో చాలా మంది తమ ఇళ్లలో చిలుకలను కూడా పెంచుతుంటారు. అయితే చిలుకలను ఇంట్లో ఉంచడం శుభమో, అశుభమో ఇప్పుడు తెలుసుకుందాం? చిలుక అందరికీ కలిసి రాదని, వివిధ పరిస్థితుల్లో భిన్నమైన ఫలితాలను ఇస్తుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.

ఎలాంటి పరిస్థితుల్లో శుభ సూచకం అంటే..

- ఇంటికి ఉత్తరం వైపు చిలుకను ఉంచితే శుభం కలుగుతుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. దీనివల్ల పిల్లలకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిలుకను ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.

- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిలుకను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లోని వారికి అనారోగ్యం తగ్గుతుంది. నిరాశ వాతావరణం ఉండదు. మీ ఇంట్లో చిలుక ఉంటే జాతకంలో రాహువు, కేతువు, శని వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి. ఇంట్లో చిలుకను ఉంచడం ద్వారా, అకాల మరణాల అవకాశాలను కూడా నివారించవచ్చు.

- మీరు చిలుకను పంజరంలో ఉంచినట్లయితే, అది సంతోషంగా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే చిలుక సంతోషంగా లేకుంటే మీ జీవితంపై ప్రతికూల ప్రభావాలు చూడవచ్చు.

ఈ పరిస్థితుల్లో అశుభ ఫలితాలు..

- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి తన జాతకంలో చిలుకను పెంచుకునే యోగం లేకపోతే, దానికి దూరంగా ఉండాలి. అలాగే ఆ వ్యక్తి దుబారాకు గురవుతాడు.

చిలుక సంతోషంగా లేకుంటే, అది తన యజమానిని శపించగలదని కూడా నమ్ముతుంటారు. దీని కారణంగా మానవ జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.

- మీ ఇంట్లో గొడవ జరిగి, చిలుక ఆ విషయాలను పునరావృతం చేస్తే, జ్యోతిషశాస్త్రంలో ఈ సంకేతాలను కూడా అశుభమైనవిగా పరిగణిస్తారు.

(గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జనాల విశ్వాసాలు, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇక్కడ అందించాం. ఇది నిజమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

Show Full Article
Print Article
Next Story
More Stories