Vastu Tips: ఆదివారం ఈ పరిహారం చేయండి.. ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు..!

Vastu Tips: జీవితంలో ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవకపోతే మనశ్శాంతి ఉండదు.

Arun Chilukuri
Updated on: 23 July 2023 7:01 AM IST
According to Vastu if This Compensation is Done on Sunday There Will be no Shortage of Money in the House
X

Vastu Tips: ఆదివారం ఈ పరిహారం చేయండి.. ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు..!

Vastu Tips: జీవితంలో ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవకపోతే మనశ్శాంతి ఉండదు. వాస్తు ప్రకారం దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవి తెలుసుకొని పరిహారం చేయాలి లేదంటే చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదివారం సూర్యభగవానుడి పూజించే రోజు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. సూర్య స్థానం బలపడాలంటే ఆదివారాల్లో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆ పరిహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. ఆదివారం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. దీంతోపాటు 'ఓం సూర్య నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్య నమః' అనే మంత్రాన్ని జపించండి.

2. శాస్త్రాల ప్రకారం ఆదివారం సాయంత్రం పీపుల్ చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించాలి. దీంతో లక్ష్మిమాత సంతోషించి ఇంటికి సంపదని తీసుకొస్తుంది. ఈ పరిహారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3. జాతకంలో సూర్యుడు బలపడాలంటే ఆదివారం ఎవరికైనా బెల్లం, పాలు, బియ్యం, దుస్తులు, దానం చేయాలి. ఇది మీకు విజయాన్ని అందిస్తుంది.

4. మీ కోరిక నెరవేరాలని అనుకుంటే ఆదివారం మీ మాటలను మర్రి ఆకుపై రాసి ప్రవహించే నీటిలో వేయండి.

5. ఆదివారం చేపలకు పిండి వంటలు వేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ మాత ఆశీస్సులు అందుతాయి.

6. ఆదివారం 3 చీపుర్లు కొని సోమవారం వీటిని గుడికి దానం చేయండి. అదృష్టం కలుగుతుంది. అశుభ కార్యాలు తొలగిపోతాయి.

7. ఆదివారం సొంత చేతులతో ఆవుకి నెయ్యి, బెల్లం తినిపించండి. ఇలా చేస్తే ఇంట్లోకి డబ్బురావడాన్ని ఎవ్వరు ఆపలేరు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మతాల విశ్వాసాల ఆధారంగా అందించాం. ఇవి నిజ జీవితంలో జరగొచ్చు లేదా జరగకపోవచ్చు. వీటిని హెచ్‌ఎంటీవీ నిర్థారించడంలేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story