Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు డబ్బు నష్టానికి చిహ్నాలు.. తెలియకుంటే నష్టపోతారు..!

Vastu Tips: వాస్తు శాస్త్రాన్ని విశ్వసించేవారు ఏ పనిచేసినా వాస్తు ప్రకారమే చేస్తారు. వివిధ మత గ్రంథాలలో మంచి చెడులు రెండింటి గురించి తెలిపారు.

Shekhar G
Updated on: 13 Aug 2023 7:01 AM IST
According To Vastu If These Signs Are Seen In The House There Will Be Loss Of Money
X

Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు డబ్బు నష్టానికి చిహ్నాలు.. తెలియకుంటే నష్టపోతారు..!

Vastu Tips: వాస్తు శాస్త్రాన్ని విశ్వసించేవారు ఏ పనిచేసినా వాస్తు ప్రకారమే చేస్తారు. వివిధ మత గ్రంథాలలో మంచి చెడులు రెండింటి గురించి తెలిపారు. అయితే కొన్ని సంకేతాలు మంచిని సూచిస్తే కొన్ని సంకేతాలు చెడుని సూచించాయి. డబ్బు వచ్చే ముందు కొన్ని ప్రత్యేక శుభ సంకేతాలు వచ్చినట్లే డబ్బు నష్టం జరిగేముందు కూడా కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తే అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీ దేవి మీపై కోపంగా ఉందని అర్థం. అలాంటి సంకేతాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

మనీ ప్లాంట్ ఎండిపోవడం

ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ ఎటువంటి కారణం లేకుండా ఎండిపోతుంటే అది లక్ష్మి మాత కోపానికి సంకేతమని అర్థం చేసుకోవాలి. మనీ ప్లాంట్ డబ్బును ఆకర్షించే మొక్క. ఇది ఎండిపోతే భవిష్యత్తులో మీరు డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అర్థం. కాబట్టి ఇలాంటి సందర్భంలో సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలి.

ఆభరణాలు దొంగిలించడం

బంగారం, వెండి శుభప్రదంగా భావిస్తారు. నగలు దొంగిలించబడినా లేదా కింద పడిపోయినా అది లక్ష్మీ దేవి కోపం వచ్చిందని అర్థం. ఈ పరిస్థితిలో వస్తువులకి భద్రతను పెంచడంతో పాటు ఎలాంటి ప్రమాదం జరగకూడదని లక్ష్మీ మాతని ప్రార్థించాలి.

పాలు పగలడం

ఇంట్లో లక్ష్మిమాతకి ఎక్కువగా పాలతో చేసిన తీపిని నైవేద్యంగా పెడుతారు. అయితే పదే పదే పాలు పగలితే మంచిది కాదు. డబ్బు నష్టం జరగబోతుందని అర్థం. శుక్రవారం రోజున అమ్మవారిని పూజించి ఆశీర్వదించమని ప్రార్థించాలి.

కుళాయి కారడం

నీటిని వృధా చేయడం వల్ల డబ్బు నష్టం, కీర్తి నష్టం జరుగుతుంది. అందువల్ల ఇంటి వంటగది లేదా బాత్రూంలో ఏదైనా కుళాయి నీరు కారడం ప్రారంభిస్తే వెంటనే ఆ సమస్యని పరిష్కరించండి. లేదంటే ఇది మిమ్మల్ని నెమ్మదిగా పేదరికం వైపు నడిపిస్తుందని గుర్తుంచుకోండి.

Shekhar G

Shekhar G

Next Story