Vastu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఉచితంగా తీసుకోవద్దు.. తర్వాత బాధపడతారు..!

Vastu Tips: వాస్తు శాస్త్రం చాలా ప్రాచీన శాస్త్రం. దీని ప్రకారం మనిషి ఏ పని చేసినా సరైన విధానంలో చేయాలని చెబుతోంది. లేదంటే పాజిటివ్‌కు బదులు నెగిటివ్‌ ఎఫెక్ట్‌ ఉంటుందని హెచ్చరిస్తుంది.

Shekhar G
Updated on: 13 Dec 2023 5:00 PM IST
According To Vastu Do Not Take These Things For Free Even By Mistake You Will Suffer Later
X

Vastu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఉచితంగా తీసుకోవద్దు.. తర్వాత బాధపడతారు..!

Vastu Tips: వాస్తు శాస్త్రం చాలా ప్రాచీన శాస్త్రం. దీని ప్రకారం మనిషి ఏ పని చేసినా సరైన విధానంలో చేయాలని చెబుతోంది. లేదంటే పాజిటివ్‌కు బదులు నెగిటివ్‌ ఎఫెక్ట్‌ ఉంటుందని హెచ్చరిస్తుంది. వాస్తు శాస్త్రం శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక స్థితి, సంతోషం, అభివృద్ధి మెరుగుపరుచుకోవడానికి చాలా ముఖ్యమైన నియమాలను ఇందులో ప్రస్తావించారు. వీటిని పాటిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. లేదంటే కష్టాలతో నిండి ఉంటుంది. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఎవరి నుంచి ఉచితంగా తీసుకోకూడదు. అవి పేదరికానికి దారితీస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఉ ప్పు

వాస్తు శాస్త్రంలో ఉప్పు శనికి సంబంధించినది. ఉప్పు ఎప్పుడూ ఉచితంగా తీసుకోవద్దు. ఒకరి దగ్గర ఉచితంగా ఉప్పు తీసుకుని వాడితే అప్పుల భారం పెరుగుతుంది. వేరొకరి నుంచి ఉప్పు తీసుకొని ఉపయోగించడం వల్ల వ్యక్తి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడతాడు. ఉచిత ఉప్పును ఉపయోగించడం వల్ల రోగాల సమస్య, అప్పుల బాధలు పెరుగుతాయి.

రుమాలు

ఒకరి నుంచి ఉచితంగా రుమాలు తీసుకోవడం లేదా ఉపయోగించడం వల్ల మీరు పేదరికానికి వెళుతారు. ఉచితంగా తీసుకున్న రుమాలు వాడటం వల్ల గొడవలు జరుగుతాయి. భవిష్యత్‌లో సంబంధాలు పాడవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు క్షీణిస్తాయి. అందుకే ఎవరి నుంచి ఉచితంగా రుమాలు తీసుకోకూడదు.

ఇనుము

శనిగ్రహానికి ఇనుముకు సంబంధం ఉంటుంది. ఐరన్ లేదా ఇనుముతో చేసిన వస్తువులను ఎవరి దగ్గర నుంచి ఉచితంగా తీసుకోవద్దు. ఇంట్లోకి ఇనుము తీసుకురావడం పేదరికం, అడ్డంకులు, ఒత్తిడికి దారితీస్తుంది. ఐరన్‌ను ఉచితంగా ఉపయోగించడం వల్ల జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్య వస్తుంది. దీని కారణంగా జీవితంలో ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా మారుతుంది. అందువల్ల ఉచితంగా వచ్చిన ఇనుమును ఉపయోగించకూడదు.

సూది

ఒక వ్యక్తి ఎవరి నుంచి ఉచితంగా సూదిని తీసుకోకూడదు. దీనివల్ల సంబంధాలు చెడిపోతాయి. ఉచితంగా తీసుకున్న సూదులను ఉపయోగించడం వల్ల వైవాహిక జీవితం, ప్రేమ సంబంధాలపై చెడు ప్రభావం పడుతుంది. ఉచిత సూదులు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. మీకు అవసరమైతే మీ సూదిని మీరే కొనుగోలు చేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉచితంగా ఇచ్చిన సూది జీవితంలో నెగిటివిటిని తెస్తుంది.

నూనె

వాస్తు ప్రకారం ఎవరి దగ్గర ఉచితంగా నూనె తీసుకోకూడదు. దీని వల్ల పెద్ద ఇబ్బందుల్లో పడుతారు. ఉచిత చమురు మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. నూనె నేరుగా శని దేవుడికి సంబంధించినది. ఉచితంగా నూనె వాడితే జీవితంలో పేదరికం వస్తుందని నమ్మకం.

Shekhar G

Shekhar G

Next Story