Vaastu Tips: బెడ్‌రూంలో ఈ తప్పులు చేయవద్దు.. ఆస్తులన్ని అంతమైపోతాయి..!

Vaastu Tips: ఒక ఇంటికి వాస్తు పక్కాగా ఉంటేనే అన్ని విషయాలు సరైన సమయంలో సరైన విధంగా జరుగుతాయి.

Arun Chilukuri
Updated on: 30 Jun 2023 8:01 PM IST
According to Vaastu Dont Make These Mistakes in the Bedroom all Wealth Will be Lost
X

Vaastu Tips: బెడ్‌రూంలో ఈ తప్పులు చేయవద్దు.. ఆస్తులన్ని అంతమైపోతాయి..!

Vaastu Tips: ఒక ఇంటికి వాస్తు పక్కాగా ఉంటేనే అన్ని విషయాలు సరైన సమయంలో సరైన విధంగా జరుగుతాయి. లేదంటే రకరకాల సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఒక ఇంటిలో బెడ్‌రూంకి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. వీటిని కచ్చితంగా పాటించాలి. లేదంటే సంపాదించిన ఆస్తులన్ని ఐసు ముక్కలా కరిగిపోతాయి. వాస్తు ప్రకారం పడకగదిలో చేయకూడని కొన్ని తప్పుల గురించి ఈరోజు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. ఇంట్లోకి డబ్బు రావడం ఆగిపోతుంది. అలాగే మంచం మీద వదిలేసిన ఆహారపదార్థాలు తినడం వల్ల రాత్రిపూట పీడకలలు వస్తాయి. చాలామంది టీ-కాఫీ, ఆహారం తిని కప్పులు ప్లేట్లని మంచం కింద లేదా పక్కన పెడుతారు. దీని వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి తప్పు అస్సలు చేయకూడదు.

బెడ్‌రూమ్‌లో లైట్‌ ఎప్పుడూ తలపైన ఉండకూడదు. మంచానికి ఎదురుగా ఉన్న గోడపై అమర్చాలి. వార్తాపత్రికలు, పుస్తకం వంటివి మంచం మీద లేదా దిండు కింద పెట్టకూడదు. దీని కారణంగా ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇది నేరుగా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో పాటు ప్రగతి పథానికి అడ్డుకట్ట పడుతుంది. చాలా మంది బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ పెట్టుకుంటారు. ఇందులో అద్దం ఉండటం వల్ల అద్దంలో మంచం చిత్రం కనిపిస్తుంది. దీని వల్ల వాస్తు దోషం కలుగుతుంది. పడకగదిలో అద్దం పెట్టకూడదు. అలాగే మురికి బట్టలు, బూట్లు, చీపురు వంటి వాటిని ఉంచకూడదు. చెత్తను మంచం కింద ఉంచకూడదు. పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయవద్దు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story