Religion News: ఇలాంటి ఇండ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు.. మీరు చేసే తప్పులే కారణం..!

Religion News: హిందూ మతం ప్రకారం.. లక్ దేవిని సంపద దేవతగా భావిస్తారు.

Shashank Gullapelli
Updated on: 4 April 2024 6:01 PM IST
According To Hinduism Goddess Lakshmi Cannot Enter Such Houses The Reason Is Because Of Your Mistakes
X

Religion News: ఇలాంటి ఇండ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు.. మీరు చేసే తప్పులే కారణం..!

Religion News: హిందూ మతం ప్రకారం.. లక్ దేవిని సంపద దేవతగా భావిస్తారు. ఆమె ఎక్కడ నివసిస్తుందో అక్కడ సంపదకు లోటుండదు. ఆ కుటుంబ సభ్యులపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవి రెండు తప్పులు చేసేవారి ఇంట్లో అస్సలు ఉండదు. దీనివల్ల వారు ఎప్పటికీ పేదరికంలోనే ఉంటారు. తరచుగా ధన నష్టం, ఇతర రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

వరాహ పురాణం ప్రకారం దేవతలు సాయంత్రం భూమిని సందర్శించడానికి వస్తారు. మొదటగా శివుడు తర్వాత లక్ష్మీ దేవి ఇద్దరూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పర్యటిస్తారు. ఈ సమయంలో ఇంటి ముందు, దర్వాజ మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంటిలోకి వెళ్లదు. ఇంటి మెయిన్ గేటును ఎప్పుడూ శుభ్రంగా ఉంచి కల్లాపి చల్లి, దీపాలు వెలిగించి, రంగోలి వేసిన ఇండ్లలోకి ప్రవేశిస్తుం ది. అలాగే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలని గుర్తుంచుకోండి.

అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య నిద్రించడం అశుభం అని గుర్తుంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ సమయంలో నిద్రించే వారి ఇళ్లలో లక్ష్మీదేవికి బదులుగా పేదరికం వస్తుంది. ఈ రెండు పనులు చేసేవారి ఇళ్లలో ఆనందం, శ్రేయస్సు పూర్తిగా చెదిరిపోతుంది. అలాగే ఇంట్లో ఉండే వంటింట్లో తిన్న ప్లేట్లు, గిన్నెలు అలాగే వదిలేయకూడదు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story