Shiva Puja: సోమవారం శివుడికి ఇలా అభిషేకం చేయండి.. ఈ సమస్యలు తొలగిపోతాయి..!

Shiva Puja: సోమవారం మహాశివుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల అన్ని బాధలు దూరమవుతాయి.

Arun Chilukuri
Updated on: 17 July 2023 6:00 AM IST
Abhishek Lord Shiva With These Ingredients on Monday all Wishes Will be Fulfilled
X

Shiva Puja: సోమవారం శివుడికి ఇలా అభిషేకం చేయండి.. ఈ సమస్యలు తొలగిపోతాయి..!

Shiva Puja: సోమవారం మహాశివుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల అన్ని బాధలు దూరమవుతాయి. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కోరిన కోరికలన్ని నెరవేరుతాయి. ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. అందుకే ఈరోజు కొన్ని పదార్థాలతో శివాభిషేకం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. శివుడు తెల్లటి వస్తువులతో సంబంధం కలిగి ఉంటాడు. పాలు, పెరుగు, పంచదార, బియ్యం మొదలైన వస్తువులతో అభిషేకం చేయాలి. జీవితంలో ఉన్న సమస్యలు అన్ని తొలగిపోతాయి. పూజ పద్దతి గురించి తెలుసుకుందాం.

పాలు: పచ్చి పాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల ఇంట్లో గొడవలు, మనస్పర్థలు దూరమవుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. టెన్షన్, ఆందోళన తొలగిపోతాయి.

పెరుగు: సోమవారం పెరుగుతో శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి.

చక్కెర: సోమవారం ఆ మహాశివుడికి చక్కెరతో అభిషేకం చేయడం వల్ల తెలివితేటలు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి.

వెన్న: సోమవారం శివుడికి వెన్నతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. సంతాన సంతోషాన్ని పొందలేని దంపతులు సంతాన సుఖాన్ని పొందుతారు. సంతానం పొందేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story