Viral Video: ఈ కాలం అమ్మాయిలతో ఇలాగే ఉంటుంది.. వైరల్‌ వీడియో..!

Young Woman Coconut Puja Goes Hilariously Wrong  Internet Cant Stop Laughing Viral Video
x

Viral Video: ఈ కాలం అమ్మాయిలతో ఇలాగే ఉంటుంది.. వైరల్‌ వీడియో..!

Highlights

Viral Video: ప్రస్తుతం యువత తీరు మారుతోంది. సున్నితంగా, కష్టానికి దూరంగా పెరుగుతున్నారు. ఒకప్పుడు చదువుకునే వారు కూడా రకరకాల పనులు చేసే వారు.

Viral Video: ప్రస్తుతం యువత తీరు మారుతోంది. సున్నితంగా, కష్టానికి దూరంగా పెరుగుతున్నారు. ఒకప్పుడు చదువుకునే వారు కూడా రకరకాల పనులు చేసే వారు. కానీ ప్రస్తుతం పేరెంట్స్‌ కూడా పిల్లలను కష్ట పెట్టాలని అనుకోవడం లేదు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు మరింత సున్నితంగా ఉంటున్నారు. డైట్ల పేరుతో సగం తిండే తింటున్నారు. దీంతో ఎప్పుడూ బలహీనంగా కనిపిస్తున్నారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా మీ సందేహం. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో నేటి యువతుల తీరుకు అద్దం పడుతోంది. ఓ యువతి కొత్తగా కొన్న స్కూటీకి పూజ చేస్తోంది. ఈ క్రమంలో టెంకాయ కొట్టాల్సి వస్తుంది. టెంకాయను చేతిలోకి తీసుకుని శక్తినంతా వినియోగించి బలంగా నేలపై కొట్టింది. అయితే టెంకాయ పగలడం మానేసి… బంతిలా పైకి లేచి కొట్టిన దిక్కుకు ఎగిరి, పక్కనే ఉన్న మురికి కాలువలో పడి పోయింది.

ఈ అనూహ్య ఘటన చూసిన ఆ యువతి కూడా ఆశ్చర్యపోయి నవ్వింది. ఈ ఫన్నీ సన్నివేశాన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీశాడు. తరువాత ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె శక్తికి ఎవరు సమానం కాదంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తే ‘‘డ్రైవింగ్ చేస్తే ఇంకెలా ఉంటుందో’’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బైక్ కూడా ఆ టెంకాయాలాగే వెళ్తుంది కాబోలు అంటూ మరో వ్యక్తి స్పందించారు. మొత్తం మీద ఏదో సరాదగా తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories