ఆషాఢంలో అతివలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

ఆషాఢంలో అతివలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
x
Highlights

ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. ఆషాఢం మాసంలో మహిళలు గోరింటాకును ఎందుకు పెట్టుకుంటారు..? దీని వెనుక పలు కారణాలున్నాయి. ఆషాడంలో...

ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. ఆషాఢం మాసంలో మహిళలు గోరింటాకును ఎందుకు పెట్టుకుంటారు..? దీని వెనుక పలు కారణాలున్నాయి. ఆషాడంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది.

అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా.. డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories