ఓవర్ నైట్‌లో సోషల్ మీడియా స్టార్స్‌.. ఇంతకీ వాళ్లెవరో ఓ లుక్కేద్దాం

Who Became Overnight Sensations on Social Media
x

ఓవర్ నైట్‌లో సోషల్ మీడియా స్టార్స్‌.. ఇంతకీ వాళ్లెవరో ఓ లుక్కేద్దాం

Highlights

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా తన అందమైన కళ్లు, అమాయకమైన చూపులతో అందర్నీ కట్టిపడేశారు.

Social Media Stars Overnight: సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. అయితే కొందరు వారి కళలను, నైపుణ్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంటే.. మరికొందరు మాత్రం కష్టపడకుండానే అదృష్టం వారిని వరిస్తుంది. దాంతో వారు అనుకోకుండా ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోతున్నారు. అలా రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలకు తరలివస్తున్నారు. అయితే ఇక్కడ పూసల దండలు అమ్ముకునే మోనాలిసా అనే అమ్మాయి అందర్నీ ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా తన అందమైన కళ్లు, అమాయకమైన చూపులతో అందర్నీ కట్టిపడేశారు.

మహాకుంభమేళాలో పూసలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా అనూహ్య రీతిలో సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. యూట్యూబర్లు, టీవీ ఛానళ్లు ఆమెపైనే ఫోకస్ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ బ్యూటీ అందాన్ని మెచ్చిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. ఆమెకు తన సినిమాలో ఆఫర్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఆమెకు యాక్టింగ్ నేర్చించి మరీ తన సినిమాల్లోకి తీసుకుంటామని చెప్పారు.

ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క సినిమాతోనే సెన్సెషన్ సృష్టించింది. మలయాళ చిత్రం ఒరు అదార్ లవ్‌లోని ఒక చిన్న క్లిప్ వైరల్ కావడంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. ఒక్క కన్ను కొట్టి కుర్రకారును తన మాయలో పడేసుకుంది ప్రియా వారియర్. దీంతో ఆమెకు వింక్ గర్ల్‌ అనే పేరు వచ్చింది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. చివరిసారిగా సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్.. కస్టమర్లను ఆకర్షించడానికి కచ్చా బాదం పాట రూపొందించి పాడారు. ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. తన ట్యూన్‌కు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంతో మంది ఫిదా అయ్యారు. ఆయన పాటకు పలువురు సెలబ్రిటీలు సైతం డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కచ్చా బాదం పాటకు అంజలి అరోరా వినూత్నంగా డ్యాన్స్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు పూపేసింది. దీంతో అంజలి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. కచ్చా బాదం ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఆ వీడియో వరల్డ్ ఫేమస్ అయింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే ఓ మ్యూజిక్ సంస్థ దానికి ర్యాప్‌ను యాడ్ చేసి సాంగ్‌ని కంప్లీట్‌గా మేకోవర్ చేసేసింది.

రేణు మొండల్ కోల్‌కతా రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే వారు. లతా మంగేష్కర్ పాడిన ఆనాటి ఆణిముత్యం ఎక్ ప్యార్ కా నగ్మా హై పాటను రేణు మొండల్ పాడి ఆకట్టుకున్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. సంగీత దర్శకుడు, గాయకుడు హిమేష్ రేష్మియా ఆమెను పిలిపించి బాలీవుడ్ లో అవకాశం ఇచ్చారు. సినిమాల్లో పాటలు పాడి మరింత ఫేమస్ అయ్యారు. ఆమెకు ఆషికీ మేరీ అనే పాటతో బాగా క్రేజ్ వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని విదిశకు చెందిన ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ డ్యాన్సింగ్ అంకుల్‌గా పేరుపొందారు. ఓ పెళ్లిలో ఆయన వేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరో గోవింద శైలిలో నృత్యం చేయడంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయారు సంజీవ్ శ్రీ వాస్తవ.

Show Full Article
Print Article
Next Story
More Stories