'గ్రీన్‌ క్రాకర్స్‌' అంటే తెలుసా?

గ్రీన్‌ క్రాకర్స్‌ అంటే తెలుసా?
x
Highlights

వెలుగులు లేని దీపావళిని.. చప్పుడు లేని టపాసుల్ని ఊహించలేం. అందుకే ప్రత్యామ్నాయంగా గ్రీన్ టపాసులు వస్తున్నాయి. అసలవి ఏమిటో తెలుసుకుందాం.

చప్పుడు లేకుండా దీపావళి ఉంటుందా? టపాసులు కాల్చకుంటే దీవాలీ మజా ఏముంటుంది? కానీ, పరిస్థితులు మారిపోయాయి. మన పండగలకు పర్యావరణ కళ్ళాలు పడుతున్నాయి. దీపావళి కాలుష్యం వెదజల్లుతుంది అంటూ నిషేధాలు ఉరుముతున్నాయి. అవును నిజమే..పర్యావరణాన్ని కాపాడుకోవాలి కదా. ఈ క్రమంలో ఇప్పడు 'గ్రీన్ క్రాక్రర్స్' అనే పదం ఎక్కువగా వినబడుతోంది. అసలు ఈ 'గ్రీన్ క్రాకర్స్' అంటే ఏమిటి? వాటికీ..మామూలు టపాసులకు తేడా ఏమిటి? తెలుసుకుందాం!


తక్కువ వాయు, ధ్వని కాలుష్యం విడుదల చేసే ముడిపదార్థాలతో తయారయ్యే టపాసులనే గ్రీన్‌ కాకర్స్‌ అంటారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసే టపాకాయల కంటే ఇవి 30–35 శాతం తక్కువగా కాలుష్యాన్ని వెదజల్లుతాయి. గ్రీన్‌ క్రాకర్స్‌లో పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5 కాలుష్య కణాలు తగ్గించే ప్రత్యామ్నాయ ముడి పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిని పేల్చినప్పుడు దుమ్మును సంగ్రహించేందుకు 'వాటర్‌ మాలిక్యూల్స్‌' వెదజల్లేలా కెమికెల్‌ ఫార్ములేషన్‌ ఉంటుంది.

వీటిలో లిథియం, బేరియం, లెడ్, అర్సెనిక్‌ వంటి రసాయనాలు ఉండవు. సాధారణ టపాకాయల నుంచి దాదాపు 160 డెసిబుల్స్‌ దాకా శబ్దాలు వస్తే గ్రీన్‌ క్రాకర్స్‌ నుంచి 110–125 డెసిబుల్స్‌ లోపే శబ్దాలు వెలువడతాయి. ఇవి మామూలు టపాసుల ధరలతో పోలిస్తే 15–20 శాతం చవకగా తయారవుతాయి. వీటిలో సేఫ్‌ వాటర్‌ రిలీజర్‌ (శ్వాస్‌), సేఫ్‌ థర్మయిట్‌ క్రాకర్‌ (స్టార్‌), సేఫ్‌ మినిమల్‌ అల్యూమినియమ్‌ (సఫల్‌) అనే మూడురకాల గ్రీన్‌ క్రాకర్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్, ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఐఆర్‌–నీరి) ఆధ్వర్యంలో వీటిని అభివృద్ధి చేశారు. గ్రీన్‌ క్రాకర్స్‌ను తయారు చేసే ఉత్పత్తిదారులు ముందుగా గ్రీన్‌ క్రాకర్స్‌ ఫార్ములేషన్‌ను ఉపయోగించేందుకు సీఎస్‌ఐఆర్‌తో ఒప్పందంపై సంతకాలు చేయాలి. వీటిని గుర్తించేందుకు వీలుగా ఈ టపాకాయల ప్యాకెట్లపై 'గ్రీన్‌ ఫైర్‌వర్క్స్‌' లోగో, క్యూర్‌కోడ్స్‌ ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories