Viral Video: అతివేగం ప్రమాదకరం అనేది ఇందుకే.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..!

Water Tanker Flips in High-Speed Crash Near Bengaluru Shocking Road Accident Caught on Camera
x

Viral Video: అతివేగం ప్రమాదకరం అనేది ఇందుకే.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..!

Highlights

Viral Video: ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయికి చేరింది.

Viral Video: ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయికి చేరింది. వేగం మితిమీరడం, మద్యం సేవించి వాహనాలు నడిపించడం, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం వహించడం వంటివి ప్రతిరోజూ ఎన్నో ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా హైవేలపై అధిక వేగంతో వాహనాలు ప్రయాణిస్తూ ఓవర్‌టేక్ చేసే సమయంలో నియంత్రణ కోల్పోవడం వల్ల భయానక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఇలాంటి ఓ ప్రమాదకర ఘటన బెంగళూరు శివారులోని దొమ్మసంద్రం వద్ద చోటు చేసుకుంది. దొమ్మసంద్రం నుంచి వర్తూర్ వైపు వేగంగా వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్‌ ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించగా కంట్రోల్ కోల్పోయింది. వేగం అధికంగా ఉండటంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ట్యాంకర్ రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ట్యాంకర్ రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని ట్యాంకర్‌ను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది ముమ్ముటికీ డ్రైవర్‌ నిర్లక్ష్యమని నెటిజన్లు స్పందిస్తున్నారు. అంత వేగంతో వాహనం నడపాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో చేస్తే అసలు రోడ్లపై ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories