Viral Video: త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.. సెకెన్ల వ్యవధిలోనే ఏం జరిగిందో ఒకసారి చూడండి..!

Watch Video Rapid Water Flow Three Boys Escape Death by Seconds
x

Viral Video: త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.. సెకెన్ల వ్యవధిలోనే ఏం జరిగిందో ఒకసారి చూడండి..!

Highlights

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ భయానక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ భయానక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలో యువకులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో చూసినవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ఎందుకంటే, కాస్త ఆలస్యం జరిగుంటే వారు అందరూ భారీ ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయేవారు.

ఈ వీడియోను @Sumanjodhpur అనే ఎక్స్‌ (ట్విటర్) యూజర్ పోస్ట్ చేశాడు. వీడియోలో ముగ్గురు యువకులు ఓ చిన్న సెలయేటులో నిలబడి కనిపిస్తున్నారు. ఆ సమయంలో నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. అయితే అదే సమయంలో పైన ఉన్న ఆనకట్ట గేట్లు తెరవడం వల్ల ఆకస్మాత్తుగా భారీగా నీరు గాలివెగతో దిగుతుంది. దానిని గమనించిన యువకులు వెంటనే అప్రమత్తమై, ఒడ్డుకి పరుగులు తీశారు. వారి వెనుకే వర్షపు వరదలా నీరు కూడా బలంగా దిగింది.

వారు ఒడ్డుకు చేరుకున్న కొద్ది క్షణాల్లోనే సెలయేలు పూర్తిగా నీటితో నిండిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం అయినా వారు ప్రాణాలు కోల్పోయేవారే. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఇంత ప్రమాదం ఎదురైనా వాళ్లు ఎలా అలా నెమ్మదిగా పరిగెత్తుతున్నారు?” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “వీళ్లంతా రీల్స్ తీసుకుంటూ ఉన్నారేమో” అంటూ మరొకరు విమర్శించారు.

ఈ వీడియోను ఇప్పటికే 1.3 లక్షల మందికి పైగా వీక్షించగా, వేల మంది లైక్ చేసి స్పందనలు తెలియజేశారు. ఈ ఘటన మరోసారి ప్రాణాలకు మించినదేమీ లేదని, ప్రకృతిని తక్కువ అంచనా వేయరాదని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories