Viral Video: ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్.. ఉడుమునే పట్టు పట్టింది

Viral Video: ఉడుమును చూస్తే కొంతమంది భయంతో పరుగులు తీస్తారు. ఉడుం ఆకారం చూసి భయపడే వాళ్లు కొంతమంది అయితే.. దాని పట్టు చూసి భయపడే వాళ్లు ఇంకొంతమంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Nov 2024 1:41 PM IST
Viral Video  Woman Holds Monitor Lizard With Hands
X

Viral Video: ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్.. ఉడుమునే పట్టు పట్టింది

Viral Video: ఉడుమును చూస్తే కొంతమంది భయంతో పరుగులు తీస్తారు. ఉడుం ఆకారం చూసి భయపడే వాళ్లు కొంతమంది అయితే.. దాని పట్టు చూసి భయపడే వాళ్లు ఇంకొంతమంది. అందుకే ఉడుం పట్టు పట్టిందంటే తప్పించుకోవడం కష్టం అని అంటుంటారు. అంటే దాని పట్టు అంత గట్టిగా ఉంటుందని అర్థం. అలాంటి ఉడుముకే చుక్కలు చూపించారు రెస్క్యూ అధికారి. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

బిలాస్‌పూర్‌లోని ఓ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్‌లో ఉడుం దూరినట్లు ఇంటి యజమాని గుర్తించారు. రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ హెడ్ అజితా పాండే వాటర్ ట్యాంక్‌లో ఉన్న ఉడుమును ఓ కడ్డీ సాయంతో పైకి లాగి చేతులతో పట్టుకుంది. బయటకు రాగానే ఆ ఉడుము ఆమెపై రెండు సార్లు దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ఏ మాత్రం భయపడకుండా దాని తోకను వదలకుండా గట్టిగా పట్టుకుంది. ఆ ఉడుమును రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాలుగు కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. దాదాపు 4 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆమెకు అసలు భయం అనేదే లేనట్టుంది అంటూ కామెంట్లు చేశారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story