Viral video: వీరోచితంగా పరుగుపెట్టి.. మంటల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్‌‌ని రక్షించిన మహిళ.. వైరల్ వీడియో

Viral Video: అకస్మాత్తుగా లారీలో మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ కాసేపు అలానే డ్రైవ్ చేసాడు. అయితే అటుగా వెళుతున్న ఓ లేడీ పోలీస్ అది చూసి వేగంగా ఆ లారీ దగ్గరకు పరుగుపెట్టుకుని వచ్చింది.

Indira Ram
Published on: 8 July 2025 8:46 PM IST
Viral video
X

Viral video: వీరోచితంగా పరుగుపెట్టి.. మంటల్లో చిక్కుకున్న లారీ డ్రైవర్‌‌ని రక్షించిన మహిళ.. వైరల్ వీడియో

Viral video: అకస్మాత్తుగా లారీలో మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ కాసేపు అలానే డ్రైవ్ చేసాడు. అయితే అటుగా వెళుతున్న ఓ లేడీ పోలీస్ అది చూసి వేగంగా ఆ లారీ దగ్గరకు పరుగుపెట్టుకుని వచ్చింది. మంటలను ఆపడంలోనూ.. డ్రైవర్‌‌ని రక్షించడంలో ఆ లేడీ వీరోచితంగా వ్యవహరించింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వావ్.. లేడీ పోలీస్.. సెల్యూట్ ఉమెన్ అంటూ నెటిజన్లు ఆమెను తెగ మెచ్చేసుకుంటున్నారు.. వివరాల్లోకి వెళితే..

లారీలో మంటలు అకస్మాత్తుగా అంటుకోవడంతో వీరోచితంగా వ్యవహరించిన ఒక మహిళా పోలీస్‌ని ఇప్పుడు నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఆమె పేరు షిమ్లాజాట్, ఆమె అటుగా వెళుతున్న సమయంలో లారీకి మంటలు అంటుకోవాడాన్ని గుర్తించింది. ఇక ఆ లారీ వెనకాల పరుగులు తీసింది. ముందు కాసేపు తన కారాలో లారీ వెనకాలే ఫాలో అయింది. ఆ తర్వాత తన దగ్గరున్న మైక్ లోంచి లారీని పక్కకు ఆపమని చెబుతూ రోడ్డుపైన పరుగు పెట్టి లారీ దగ్గరకు వెళ్లింది.

అయితే ఇంతటతో ఆమె డ్యూటీ అయిపోయింది. మళ్లీ కారు ఎక్కి వెళ్లిపోయింది అనుకోనేరు. అసలు కాదు.. పరుగు పరుగున వెళ్లి లారీ డ్రైవర్ కూర్చున్న చోటకు వెళ్లి అతన్ని వెంటనే బయటకు లాగింది. ఆ తర్వాత నీళ్ల ట్యాంకులను తెప్పించి మంటలను ఆర్పించింది. అంతేకాడు ఈ పనిలో కూడా ఆమె చకచకా వ్యవహరించి పెద్ద ప్రమాదం జరగకుండా ముందే జాగ్రత్తపడింది. పోలీసు డ్రెస్సులో తడిచిపోయిన ఆమెను చూసిన అందరూ సెల్యూట్ చేయకుండా ఎలా ఉంటారు. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. నెటిజన్లు కూడా సూపర్ ఉమెన్.. సెల్యూట్ లేడీ పోలీస్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.



Indira Ram

Indira Ram

Next Story