Viral Video: టెస్లా కారుకు పెట్రోల్... తెలివి తెల్లారినట్లే ఉందిగా...

Viral Video: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్న ఏకైక ఎలక్ట్రానిక్ కార్ టెస్లా.

Arun Chilukuri
Updated on: 9 May 2023 5:42 PM IST
Viral Video Woman Attempt to Fuel up Tesla Car With Petrol
X

Viral Video: టెస్లా కారుకు పెట్రోల్... తెలివి తెల్లారినట్లే ఉందిగా...

Viral Video: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్న ఏకైక ఎలక్ట్రానిక్ కార్ టెస్లా..వీటిలో వాడిన టెక్నాలజీ మరే ఇతర కారుల్లో వాడటం లేదు. ఇదిలా ఉంటే ఈ కారు కొనుగోలు చేసిన యజమాని గ్యాస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ సిబ్బందిని ఆట పట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గ్యాస్ ఫిల్లింగ్ కోసం అన్నట్లుగా గ్యాస్ స్టేషన్ ముందు ఒక కారు ఆగింది. అక్కడ పని చేస్తున్న అమ్మాయి వెంటనే పంప్ తీసుకొని వాహనంలో పెట్రోల్ నింపే ప్రయత్నం చేసింది. అయితే ట్యాంక్ ఎక్కడ ఉందో తెలియక..ఆ కారు చుట్టూ తిరుగుతూ పెట్రోల్ ట్యాంక్ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా ఆ అమ్మాయి పలు మార్లు కారు చుట్టూ తిరగడాన్ని అక్కడే ఉన్న వాళ్లు వీడియో తీశారు. పెట్రోల్ ఎలా కొట్టాలా అని ఆలోచిస్తుండగా కారు యజమాని వచ్చి ఇది పెట్రోల్ కారు కాదని..ఎలక్ట్రిసిటీ పై నడిచే టెస్లా కార్ అని తెలపడంతో ఆ అమ్మాయి తెగ సిగ్గుపడిపోతుంది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు ఓ లుక్కేయండి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story