Viral Video: పామును అమాంతం మింగేసిన తాబేళు.. వైరల్ వీడియో

viral video: పామును అమాంతం మింగేసిన తాబేళు.. వైరల్ వీడియో
x

viral video: పామును అమాంతం మింగేసిన తాబేళు.. వైరల్ వీడియో

Highlights

ఇటీవల పాముల గురించి వినూత్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Viral Video: ఇటీవల పాముల గురించి వినూత్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా అడవుల్లో కనిపించే పాముల విచిత్ర ప్రవర్తనలను నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. సాధారణంగా పాములు విషపూరితమైనవే. కోబ్రా వంటి పాములు తమ నోటిలో నుంచి విషాన్ని దూరంగా చిమ్మే విడిచే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాంటి పాములను చూసి కొన్ని జంతువులు కూడా భయపడిపోతుంటాయి.

అయితే పాములకు కొన్ని శత్రువులు సహజంగానే ఉంటారు. గద్దలు, ముంగీసలు పాములను వేటాడి చంపుతింటాయి. అయితే పాముల‌ను తినే జాబితాలోకి తాబేలు కూడా చేరింది. తాజాగా నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఓ వీడియోనే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

నీటిలో ఉన్న ఓ పెద్ద తాబేలు… అదే చోట ఉన్న పామును చూసి ఒక్కసారిగా దానిపై దాడికి దిగింది. తాబేలు పామును నోటితో పట్టుకుని నెమ్మదిగా మింగేస్తోంది. తాబేలు చుట్టుపక్కల నీటిలో ఈదుతూ, సమీపంలో ఉన్న పామును గమనించింది. ఆ వెంటనే పాము దాకా చేరి, ఒక్కసారిగా దాన్ని నోటితో పట్టుకుంది. ఏమీ చేయలేని స్థితిలో పాము తాబేలు నోటిలోకి వెళ్లిపోయింది.

దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌లో రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేవారు. దీంతో ఈ వీడియో కాస్త వైర‌ల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. ప్ర‌మాద‌క‌ర‌మైన పాముల‌కు కూడా ప్ర‌మాదం పొంచి ఉందంటూ కామెంట్స్ చేస్తున్ఆన‌రు.

Show Full Article
Print Article
Next Story
More Stories