Viral Video: ఫ్రిడ్జ్ వెనుక నుంచి వింత శబ్దాలు...వెళ్లి చూస్తే..షాక్..వైరల్ వీడియో

Viral Video
x

Viral Video: ఫ్రిడ్జ్ వెనుక నుంచి వింత శబ్దాలు...వెళ్లి చూస్తే..షాక్..వైరల్ వీడియో

Highlights

Viral Video: సోషల్ మీడియాలో ఉన్న ఒక వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోని దాదాపు 7లక్షలమందికి పైగా చూశారు. 14వేల మందికి పైగా ఈ వీడియోకి లైక్ కొట్టారు. ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లు వేలల్లో వస్తున్నాయి.

Viral Video: సోషల్ మీడియాలో ఉన్న ఒక వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోని దాదాపు 7లక్షలమందికి పైగా చూశారు. 14వేల మందికి పైగా ఈ వీడియోకి లైక్ కొట్టారు. ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లు వేలల్లో వస్తున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అంటే మీరే చూడండి.

ఒక కుటుంబం అంతా కలిసి ఫ్రంట్ గదిలో భోజనం చేస్తున్నారు. అయితే బెడ్ రూమ్‌కి దగ్గరలో ఫ్రిడ్జ్ వెనుకాల నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయి. ఆ ఇంటి యజమానికి ముందు ఆ శబ్ధాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత ఇల్లంతా గాలించిన తర్వాత ఫ్రిడ్జ్‌ వెనుక నుండి శబ్ధాలు వస్తున్నట్లు గుర్తించారు. తీరా చూస్తే ఫ్రిడ్జ్ ఒక భయానకమైన విషపూరిత పాము కనిపించింది. దీంతో ఇంట్లో వాళ్లంతా హడలిపోయారు.

పామును ఫ్రిడ్జ్‌ వెనుకాల గుర్తించిన వెంటనే పాములు పట్టేవారికి ఫోన్ చేశారు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ అక్కడకు వచ్చి పామును పట్టే ప్రాసెస్ అంతటినీ వీడియో తీశాడు. ఈ వీడియోలో ఆ పాము ఫ్రిడ్జ్ వెనుకాల ఉన్న భాగాన్ని ఎలా పట్టుకుని ఉంటుందో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మన దేశంలోనే అత్యంత విషపూరితమైన పాము అయిన కామన్ క్రైట్ గా గుర్తించారు. విచిత్రం ఏంటంటే.. ఈ ఫ్రిడ్జ్ ఉన్న పక్కనే బెడ్ ఉంది. కాసేపయ్యాక అన్నం తిన్న తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి ఈ బెడ్ పైనే పడుకోవాల్సిన వాళ్లు. అసలు ఈ పాముని ఫ్రిడ్జ్ వెనకాల గుర్తించకపోతే ఏం జరిగేదో ఊహించడానికే భయం వేస్తుంది అంటూ స్నేక్ క్యాచర్ ఆ వీడియోలో అంటున్నాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయిపోయింది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్నవాళ్లు వర్షాకాలంలో జర జాగ్రత్తగా ఉండమని నెటిజన్లు చెబుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories