Viral Video: భర్త కాళ్లు కడిగిన నీళ్లను తాగిన ఒక స్టార్ హీరోయిన్

Viral Video: భర్త కాళ్లు కడిగిన నీళ్లను తాగిన ఒక స్టార్ హీరోయిన్
x
Highlights

Viral Video: తాజాగా ఒడిసాకు చెందిన ఒక హీరోయిన తన భర్తకాళ్లను కడిగింది. ఇలా కడిగిన నీళ్లను ఎవరైనా నెత్తిమీద చల్లుకుంటారు. కానీ ఈ అమ్మడు ఏకంగా ఆ నీళ్లను తాగేసింది. ఇంకేముందు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇటు నెటిజన్లు కూడా ఆమెను బాగానే వేసుకున్నారు.

Viral Video: ఈ మధ్యకాలంలో ఏ వింతైనా ఒక ట్రెండే అవుతుంది. ఆ వీడియో వైరల్ అవుతుంది. అంటే వీడియో చేసిన తర్వాత వైరల్ అవుతుందా? వైరల్ అవ్వాలని వీడియోలు చేస్తున్నారో తెలియదు. కానీ ఈ మధ్య సెలబ్రెటీలు చేసేవన్నీ కూడా వైరల్‌గానే మారిపోతున్నాయి. తాజాగా ఒడిసాకు చెందిన ఒక హీరోయిన తన భర్తకాళ్లను కడిగింది. ఇలా కడిగిన నీళ్లను ఎవరైనా నెత్తిమీద చల్లుకుంటారు. కానీ ఈ అమ్మడు ఏకంగా ఆ నీళ్లను తాగేసింది. ఇంకేముందు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇటు నెటిజన్లు కూడా ఆమెను బాగానే వేసుకున్నారు. ఇంతకీ పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

ఒడిసా ఫిల్మ్ ఇండస్ట్రీలో నటి ఎలినా సమంతరాయ్ చాలా ఫేమస్. 2017లో అభయ అనే చిత్రంలో మొదటిసారి ఫిల్మ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ఈ అమ్మడు , తన డెబ్యూ సినిమాతోనే ఏకంగా ఒడిసా స్టేట్ ఫిల్మ్ అవార్డునే దక్కించుకుంది. సమంతరాయ్ గత సంవత్సరం నవంబర్‌‌లో బాలిలో అనురాగ్ పండా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అప్పట్లో ఈ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజా సమంతరాయ్ ఒక వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఏంటంటే.. పెళ్లి జరిగి ఇంటికి వెళ్లిన తర్వాత పెళ్లికూతురు పెళ్లి కొడుకు పాదాలను నీళ్లతో కడుగుతుంది. ఆ తర్వాత ఆ కడిగిన కాళ్లకు నమస్కరించి, ఆ నీళ్లను తాగుతుంది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. కావాలనే ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారనే కామెంట్లు వచ్చాయి. ఇది పబ్లిసిటీకోసం చేసే డ్రామాలని కూడా కామెంట్లు పెట్టారు. అయితే ఇవన్నీ చదివిన సమంతరాయ్ ధ్యాంక్యూ చెప్పి.. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.



Show Full Article
Print Article
Next Story
More Stories