Viral Video: చిమ్మ చీకట్లో చెట్టు కొమ్మపై ఏదో కదలిక.. చూశాక బెంబేలెత్తిన జనాలు!

Viral Video: చిమ్మ చీకట్లో చెట్టు కొమ్మపై ఏదో కదలిక.. చూశాక బెంబేలెత్తిన జనాలు!
x

Viral Video: చిమ్మ చీకట్లో చెట్టు కొమ్మపై ఏదో కదలిక.. చూశాక బెంబేలెత్తిన జనాలు!

Highlights

ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ భయానక వీడియో ఊపేస్తోంది. చీకటి నడుమ ఓ చెట్టు కొమ్మపై కనిపించిన ఓ కదలికతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వీడియో చూస్తే ఓ కోరికల నాగు (ఇచ్చాధారి నాగిని) చెట్టుపై కూర్చుని ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో చూసినవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఈ దృశ్యం చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున గుమికూడారు. అందరూ తమ ఫోన్‌లతో వీడియోలు తీస్తూ… ఈ దృశ్యం నిజమా? మాయమా? అనే చర్చలు మొదలయ్యాయి. చెట్టు కొమ్మపై పాము కూర్చుని ఉండటం అరుదైన విషయం. అందుకే ఈ వీడియో షాకింగ్‌గా మారింది.

ఈ నాగుని తలపై వెలుగుతో కనిపించే రత్నం లాంటిది ఉండటంతో కొందరు దీన్ని నిజమైన దేవనాగుగా పేర్కొంటున్నారు. అయితే మరికొందరైతే ఇది ఎడిటింగ్‌తో చేసిన వీడియో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే ఇది ఏఐ సహాయంతో రూపొందించారని అభిప్రాయపడుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో @Gurukulam2024 అనే ఖాతా ఈ వీడియోను షేర్ చేసింది. పలు కోణాల్లో ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది వాస్తవమా? కల్పితమా? అన్నదే ఇప్పటికీ మిస్టరీగా మిగిలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories