Viral Video: పిల్లి కోసం ఎంత రిస్క్ తీసుకున్నావు భ‌య్యా.. హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజ‌న్లు

Viral Video
x

Viral Video: పిల్లి కోసం ఎంత రిస్క్ తీసుకున్నావు భ‌య్యా.. హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజ‌న్లు

Highlights

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైర‌ల్ అవుతూనే ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రిగే వింత‌లు, విశేషాలు క్ష‌ణాల్లో అర చేతిలో వాలిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైర‌ల్ అవుతూనే ఉంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రిగే వింత‌లు, విశేషాలు క్ష‌ణాల్లో అర చేతిలో వాలిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంత‌కీ ఏంటా వీడియో.? అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వ్యక్తి తన ఇంటి గేటు దగ్గర అలా నిలుచున్నాడు. అదే సమయంలో ఓ చిన్న పిల్లి అటుగా వ‌చ్చింది. దీంతో గేటు లోపల ఉన్న పెద్ద కుక్క దానిపై దాడికి దిగేందుకు ప్రయత్నించింది. కానీ ఆ వ్యక్తి వెంటనే స్పందించాడు. ఆ కుక్క మీద దూకి దాన్ని అదిమేశాడు. దీంతో పిల్లి ఆ సమయంలో అక్కడ్నించి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది.

ఆ తర్వాత ఆ వ్యక్తి తన కుక్కను ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇదంతా అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ర‌క‌రకాలుగా స్పందిస్తున్నారు. త‌న పెంపుడు శున‌క‌మే అయినా పిల్లిని కాపాడేందుకు ఆ య‌జ‌మాని చేసిన ప‌ని నిజంగా గ్రేట్ అంటున్నారు. మ‌రికొంద‌రు అత‌నికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోను మీరూ చూసేయండి మరి.



Show Full Article
Print Article
Next Story
More Stories