Viral Video: వర్కవుట్‌ చేస్తే ఆరోగ్యం, కానీ ఇలా చేస్తే మాత్రం ప్రాణమే పోతుంది.. ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..!

Viral Video Man Performs Workout on Electric Pole Shocking Stunt Goes Viral
x

Viral Video: వర్కవుట్‌ చేస్తే ఆరోగ్యం, కానీ ఇలా చేస్తే మాత్రం ప్రాణమే పోతుంది.. ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..!

Highlights

Viral Video: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ యుగంలో ఎంతో మందికి తమ ప్రతిభను చూపించడానికి ఇది వేదికగా మారింది.

Viral Video: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ యుగంలో ఎంతో మందికి తమ ప్రతిభను చూపించడానికి ఇది వేదికగా మారింది. అయితే, కొందరు మాత్రం వైరల్ అవ్వాలనే ఆరాటంలో ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ హద్దులు దాటుతున్నారు. రద్దీ ప్రదేశాల్లో, రైలు స్టేషన్లలో, మెట్రో ట్రెయిన్‌లలో వింత విన్యాసాలు చేస్తూ ప్రజలను భయపెట్టడం ఇటీవల ఎక్కువైపోయింది. ఎలాగైనా సరే ఎక్కువ లైక్స్‌ రావాలి, త్వరగా వైరల్‌ అవ్వాలి. ఇందుకోసం ప్రాణాలకు సైత తెగిస్తున్నారు. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్నో ఓ వీడియో ఇదే కోవలోకి వస్తుంది.

వర్కవుట్స్‌ చేస్తే ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే దానికి ఓ విధానం ఉంటుంది. సాధారణంగా వర్కవుట్స్‌ ఇంట్లో లేదా జిమ్‌లో చేస్తుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం ఇందుకోసం ఏకంగా కరెంట్‌ స్తంభాన్ని ఎంచుకున్నాడు. ఎంచక్కా విద్యుత్ స్తంభంపైకి ఎక్కి కరెంట్ తీగలపై వర్కౌట్లు చేశాడు. ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి అతి ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

దీనంతటినీ అక్కడే ఉన్న వారు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంతకేముంది ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్‌ అయ్యింది. అయితే ఇది పక్కా ప్లాన్‌తో చేసినట్లు కనిపిస్తోంది. ముందుగానే కరెంట్ నిలిపివేసి, కచ్చితమైన ప్రణాళికతో స్టంట్ చేసినట్లు అర్థమవుతోంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. "పబ్లిసిటీ కోసం ప్రాణాలతో చెలగాటం ఎంతవరకు సమంజసం?" అంటూ ఆగ్రహిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వైరల్‌ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories