Viral Video: చేప కోసం గాలం వేస్తే ఊహించ‌ని ట్విస్ట్‌.. ఏం క‌నిపించిందంటే

Muskellunge Fish Viral Video
x

Viral Video: చేప కోసం గాలం వేస్తే ఊహించ‌ని ట్విస్ట్‌.. ఏం క‌నిపించిందంటే

Highlights

Muskellunge Fish Viral Video: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన త‌ర్వాత ఇలాంటి ఫిషింగ్ వీడియోలు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

Muskellunge Fish Viral Video: మన దేశంలో ఫిషింగ్ ఓ ప్రత్యేక హాబీగా కనిపించకపోయినా.. అమెరికా వంటి దేశాల్లో మాత్రం ఫిషింగ్ ఒక హ్యాబీ. చాలా మంది కాస్త స‌మ‌యం దొరికిందంటే చాలు వెంట‌నే చెరువులు, స‌రస్సుల వ‌ద్ద‌కు వెళ్తుంటారు. కుటుంబసభ్యులతో సరదాగా సమయం గడుపుతూ చేప‌ల‌ను ప‌డుతుంటారు.

సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన త‌ర్వాత ఇలాంటి ఫిషింగ్ వీడియోలు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే... ఓ వ్యక్తి వీకెండ్ రోజున తన ఇంటి దగ్గర ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు బయలుదేరాడు. ముందుగానే గాలం (ఫిషింగ్ రాడ్), ఎర తీసుకెళ్లాడు. నీటిలో గాలం వేసి.. ఓ రెండు నిమిషాల్లోనే ఏదో భారీగా కదలిక అనిపించింది.

దీంతో పెద్ద చేప దొరికింద‌ని సంతోషప‌డ్డాడు. అయితే నీళ్లలో తళతళలాడుతూ కనబడిన ఆ ఆకారం చూసి అతడు షాక్‌కు గురయ్యాడు. ఆ ఆకారం సాధారణ చేపలా లేదు. పొడవుగా, బలిష్టంగా ఉండే ఆ జీవి చూసి మొదట భయపడిపోయాడు. అది మరేదీ కాదు... ముస్కెలుంగే (Muskellunge) అనే చేప జాతి. ఇవి సాధారణంగా చేపల కన్నా చాలా పొడవుగా, బరువుగా ఉంటాయి. కొన్ని ముస్కెలుంగే చేపలు 15 కిలోల వరకూ బరువు కూడా వుంటాయి.

ఇలాంటి చేప‌లు అమెరికాలోని ఫ్లోరిడా, కెనడా, నార్త్ అమెరికాలోని సరస్సుల్లో, చెరువుల్లో ఎక్కువ‌గా ఉంటాయి. ఈ చేప‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ‌రెందుకు ఆల‌స్యం ఈ విచిత్ర‌మైన చేప‌ను ఓసారి మీరు కూడా చూసేయండి.



Show Full Article
Print Article
Next Story
More Stories