Viral Video: ఆ ఫోన్‌ ఏం పాపం చేసిందబ్బాయ్‌.. నీటిలో అలా ముంచేశావ్‌. వైరల్‌ వీడియో

Viral Video
x

Viral Video: ఆ ఫోన్‌ ఏం పాపం చేసిందబ్బాయ్‌.. నీటిలో అలా ముంచేశావ్‌. వైరల్‌ వీడియో

Highlights

Viral Video: ప్రయాగ్ రాజ్‌ కుంభమేళకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

Viral Video: ప్రయాగ్ రాజ్‌ కుంభమేళకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి కుంభమేళకు వాహనాలు క్యూ కడుతున్నాయి. రైళ్లు, బస్సులు, సొంత వాహనాలు ఇలా ప్రజలు ఓ ఉద్యమంలా వెళ్తున్నారు. ఇప్పటి వరకు త్రివేణి సంగంలో సుమారు 50 కోట్లకుపైగా మంది పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి.

144 ఏళ్ల ఏర్పడడంతో ఈ కుంభమేళకు ఇంత విశిష్టత ఏర్పడింది. ఇక దేశ నలుమూలల నుంచి విచ్చేస్తున్న ప్రజలతో కుంభమేళలో రోజూ ఏదో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంటోంది. మొన్నటి వరకు పుసలు అమ్ముకునే అమ్మాయిన మోనాలిసా ఎంత వైరల్‌ అయ్యిందో తెలిసిందే. ఇలా ప్రతీ రోజూ కుంభమేళకు సంబంధించిన ఏదో ఒక సంఘటన నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఓ యువకుడు కుంభమేళ పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చాడు. నదిలోకి దిగి మంచిగా మూడు మనకలు వేశాడు. అయితే అంతటితో ఆగకుండా తన చేతిలోని ఫోన్‌ను కూడా ప్రత్యేకంగా నీటిలో ముంచేశాడు. సాధారణంగా ఫోన్‌కు నీరు తగిలితేనే మనం భయపడుతుంటాం. అలాంటిది ఆ కుర్రాడు ఎంచక్కా ఫోన్‌ను నీటిలో ముంచేయడంతో అక్కడనున్న వారంతా ఒకింత షాక్‌కి గురయ్యారు.

ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్‌ కెమెరాలో బంధించాడు. దీంతో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఫోన్‌ స్నానం చేయించడం ఏంటి గురూ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే. మరికొందరు మాత్రం ఆ ఫోన్‌ ఎన్ని పాపాలు చేసిందో అందుకే అలా ముంచాడని అంటున్నారు. అయితే ఈ ఫోన్‌ వాటర్ ప్రూఫ్‌ అన్న ధైర్యంతోనే అలా చేశాడు, లేకపోయింటే చచ్చినా చేసే వాడు కాదని మరి కొందరు స్పందిస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories