Viral Video: సింహం వేట అంటే ఇలా ఉంటది మ‌రి.. షాకింగ్ వీడియో

Viral Video
x

Viral Video: సింహం వేట అంటే ఇలా ఉంటది మ‌రి.. షాకింగ్ వీడియో

Highlights

Viral Video: అడవి జీవుల్లో సింహం ప్రాధాన్యం ప్రత్యేకమే. దాని వేట, దూకుడుతోపాటు వ్యూహం కూడా చూసేవాళ్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా, ఒక షాకింగ్ వేట దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: అడవి జీవుల్లో సింహం ప్రాధాన్యం ప్రత్యేకమే. దాని వేట, దూకుడుతోపాటు వ్యూహం కూడా చూసేవాళ్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా, ఒక షాకింగ్ వేట దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకలితో ఉన్న ఒక సింహం, బలమైన జంతువును ఎలా వేటాడిందో చూపించే వీడియో నెటిజన్లను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఓ అడవి ప్రాంతంలో సింహం వేట కోసం తిరుగుతుంది. గమనిస్తుండగా భూమిపై ఉన్న ఒక చిన్న సొరంగంలో ఏదో క‌దులుతున్న‌ట్లు క‌నిపించింది. వెంటనే అప్రమత్తమైన సింహం నిశ్శబ్దంగా ఆ సొరంగం వద్దకు చేరింది. కాసేపు దాని కదలికలు పరిశీలించి, ఒక్కసారిగా తన పంజాతో సొరంగాన్ని పగలొట్టింది.

వెంటనే అందులో దాగున్న ఓ పెద్ద పందిని బయటికి లాక్కొచ్చింది. ఎలాగైనా బయటకు వచ్చేందుకు పంది ప్రయత్నించినా, సింహం వదల్లేదు. అది పందిని పట్టుకుని దగ్గర్లో ఉన్న పొదల్లోకి తీసుకెళ్లింది. అక్కడున్న పర్యాటకులు ఆ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో వీడియో వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ వీడియోనే సాక్ష్య‌మ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే 10వేలకు పైగా లైక్‌లు, 5 లక్షల వ్యూస్‌ను సాధించింది. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.



Show Full Article
Print Article
Next Story
More Stories