Viral Video: హోమ్‌ టూర్ విని ఉంటారు, ఈ 'గుడిసె' టూర్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Viral Video: హోమ్‌ టూర్ విని ఉంటారు, ఈ గుడిసె టూర్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
x

Viral Video: హోమ్‌ టూర్ విని ఉంటారు, ఈ 'గుడిసె' టూర్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Highlights

Viral Video: హోమ్‌ టూర్‌.. ఇటీవల ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సెలబ్రిటీలంతా తమ ఇంటిని నెటిజన్లకు చూపిస్తూ హోమ్‌ టూర్‌ పేరుతో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

Viral Video: ‘Hut Tour’ Stuns Netizens

Viral Video: హోమ్‌ టూర్‌.. ఇటీవల ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సెలబ్రిటీలంతా తమ ఇంటిని నెటిజన్లకు చూపిస్తూ హోమ్‌ టూర్‌ పేరుతో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే సామాన్యులు సైతం ఇదే ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. తమ ఇంటికి సంబంధించిన వివరాలను తెలుపుతూ వీడియోలను క్రియేట్‌ చేస్తున్నరు. వాటిని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువతి పోస్ట్‌ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

సాధారణంగా హోమ్‌ టూర్‌ అనగానే పెద్ద పెద్ద బిల్డింగ్స్‌ గుర్తొస్తాయి. కానీ ఓ యువతి మాత్రం తన గుడిసెను హోమ్‌ టూర్‌గా రూపొందించి పోస్ట్‌ చేసింది. బయటి నుంచి చూడడానికి అది సాదాసీదాగా ఉంది. లోపలికి వెళ్లి చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ముందు గదిలో ఓ భారీ బెడ్ వేసి ఉంది. దాని ఎదురుగా కూలర్ కూడా ఉంది. ఆ తర్వాత మాస్టర్ బెడ్‌రూమ్ ఉంది. ఆ గదిలో రెండు డబుల్ కాట్స్ ఉన్నాయి. ఆ తర్వాత కిచెన్ కూడా ఉంది. గ్యాస్ స్టవ్‌తో పాటు సామాన్లన్నీ చక్కగా అమర్చి ఉన్నాయి.

బయట నుంచి గుడిసెలా కనిపించినా లోపం మాత్రం పెద్ద ఇంటికి ఏమాత్రం తీసి పోకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను ఏకంగా 50 లక్షల మందికిపైగా వీక్షించారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇల్లు ఎంత పెద్దదని కాదని, మనం ఎంత సంతోషంగా ఉంటున్నాం, ఆ ఇంటిని ఎంత చక్కగా చూసుకుంటున్నామన్నదే ముఖ్యమని కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories