Viral Video: ఓర్నీ.. ఇదెక్కడి పైత్యం భయ్యా.!. స్పీడ్‌గా వస్తున్న రైలు ముందు పడుకుని మరీ..!

Viral Video: ఓర్నీ.. ఇదెక్కడి పైత్యం భయ్యా.!. స్పీడ్‌గా వస్తున్న రైలు ముందు పడుకుని మరీ..!
x
Highlights

Video Viral: ఈ మధ్య కాలంలో యువతీ యువకులు సోషల్ మీడియా ఫేమ్ కోసం చేయడమే గాకుండా, ప్రాణాలతో ఆటలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Video Viral: ఈ మధ్య కాలంలో యువతీ యువకులు సోషల్ మీడియా ఫేమ్ కోసం చేయడమే గాకుండా, ప్రాణాలతో ఆటలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వైరల్ కావాలనే ఉద్దేశంతో వారు రీల్స్ కోసం ఎలాంటి ప్రమాదకర స్టంట్లైనా చేయడానికి వెనుకాడడం లేదు. తమ ప్రాణాలకే విలువ ఇవ్వక, చుట్టుపక్కల ఉన్నవారిని భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఓ యువతి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారంపై పడ్డకుని రీల్ చేయడం చూసి అందరూ షాక్‌కి గురయ్యారు. వీడియోలో ఆమె తన మొబైల్‌ను వీడియో మోడ్‌లో ఆన్ చేసి, రైలు పట్టాల మీదే పడుకుంది. అదే సమయంలో వేగంగా రైలు ఆమె పక్కనుండి దూసుకెళ్లింది.

ఈ సన్నివేశాన్ని పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీశారు. రైలు వెళ్లిపోయిన తర్వాత యువతి సంబరంగా అరుస్తూ తన ‘ఘనకార్యం’ను సెలబ్రేట్ చేసింది.

ఆ యువతి ప్రవర్తన చూసిన స్థానికులు తట్టుకోలేక ఆమెను తీవ్రంగా మందలించారు. ‘‘ఒక్క సారి రైలులోని ఏదైనా భాగం తగిలితే ప్రాణమే పోయేది’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అలాంటి ప్రదేశాల్లో ఇలాంటి లైఫ్ రిస్క్ స్టంట్లు చేయడం క్షమించరాని అప్రమత్తతగా భావిస్తున్నారు.

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

"ఫేమ్ కోసం ఇంతటి రిస్క్ అవసరమా?", "ఇది ఫ్యాషన్ కాదు, పిచ్చి", "ఒక చిన్న తప్పు జీవితాన్ని గాలిలో కలిపేస్తుంది" అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అధికారులు ఇలాంటి ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఓవర్ నైట్ ఫేమ్ కోసం చేసే అజ్ఞానపు చర్యలు ప్రాణాలకు ముప్పుగా మారవచ్చు. సోషల్ మీడియా ఓ వేదిక మాత్రమే… దానికోసం జీవితాన్ని పణంగా పెట్టడం వాస్తవికత కాదు!


Show Full Article
Print Article
Next Story
More Stories