Viral Video: బాప్‌రే! ఏడాది బుడ్డోడు నాగుపామును కొరికి చంపేశాడు.. వీడియో వైరల్

Viral Video
x

Viral Video: బాప్‌రే! ఏడాది బుడ్డోడు నాగుపామును కొరికి చంపేశాడు.. వీడియో వైరల్

Highlights

Viral Video: నాగుపాము చేతిని చుట్టుకుంది.. కానీ చిన్నారి భయపడకుండా దాన్ని గట్టిగా కొరికేసి చంపేశాడు!

Viral Video: సాధారణంగా పాము కనిపించినా భయంతో పారిపోయే మనుషుల మద్యలో, ఏడాది చిన్నారి ఒక్కడే అసాధారణంగా ప్రవర్తించాడు. బీహార్‌లోని బెట్టియాహ్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. నాగుపాము చేతిని చుట్టుకుంది.. కానీ చిన్నారి భయపడకుండా దాన్ని గట్టిగా కొరికేసి చంపేశాడు!

పాము చుట్టుకుంది.. కానీ ఈ బాలుడు భయపడలేదు

బెట్టియాహ్ గ్రామానికి చెందిన చిన్నారి గోవిందా ఇంటి ఎదుట ఆడుకుంటుండగా ప్రమాదం చుట్టుముట్టింది. ఓ నాగుపాము అతని చేతిని చుట్టుకుని కాటేయడానికి ప్రయత్నించింది. అయితే చిన్నారి దాన్ని బొమ్మగా భావించాడో ఏమో కానీ, భయపడకుండా పామును గట్టిగా కొరికాడు. కొద్దిసేపటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

చిన్నారి పక్కన చనిపోయిన పాము

తల్లి తండ్రులు గోవిందా గొంతు రావడంలేదని గమనించి బయటకు వచ్చి చూడగా, బాబు భూమిపై క unconscious గా పడి ఉండగా పక్కనే నాగుపాము చనిపోయి ఉండడం చూసి షాక్ తిన్నారు. వెంటనే బాలుడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

డాక్టర్ల వైద్యం తర్వాత మళ్లీ చలాకీగా

బాలుడికి వెంటనే చికిత్స అందించిన డాక్టర్లు, అతని ప్రాణాలు రక్షించారు. కొన్ని గంటల తర్వాత గోవిందా మళ్లీ లేచి ఆడుకోవడం ప్రారంభించాడు. తల్లి మతేశ్వరి వద్దకు వెళ్లి ముద్దుగా ఆడుకుంటున్న అతని వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

గ్రామస్థులు ఆశ్చర్యం

ఒక ఏడాది చిన్నారి పామును ఇలా చంపేశాడని తెలుసుకున్న గ్రామస్థులు ఇంకా నమ్మలేకపోతున్నారు. "ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యమా?" అంటూ అతడిని చూసి అబ్బురపడుతున్నారు.

వైరల్ వీడియో

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ఆస్పత్రిలో బాలుడు ఆరోగ్యంగా ఆడుకుంటున్న దృశ్యాలు అందరినీ ఉల్లాసానికి గురిచేస్తున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories