Viral Video: కాలేజ్ బస్సు కనిపించగానే పరుగెత్తిన విద్యార్ధి.. ఢీ కొట్టిన మరో బస్సు ..వీడియో చూస్తుంటేనే షాక్


Viral Video: కాలేజ్ బస్సు కనిపించగానే పరుగెత్తిన విద్యార్ధి.. ఢీ కొట్టిన మరో బస్సు ..వీడియో చూస్తుంటేనే షాక్
Viral Video: బెంగుళూరు ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఎదురుగా తన కాలేజీ బస్సు కనిపించకుండా అటుఇటూ చూసుకోకుండా ఆ బస్సు ఎక్కేందుకు ఒక విద్యార్ది పరుగు పెట్టాడు.
Viral Video: బెంగుళూరు ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఎదురుగా తన కాలేజీ బస్సు కనిపించకుండా అటుఇటూ చూసుకోకుండా ఆ బస్సు ఎక్కేందుకు ఒక విద్యార్ది పరుగు పెట్టాడు. అంతలోనే పక్కనుంచి వచ్చిన ఒక బస్సు ఆ బాలుడ్ని ఢీ కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన వాళ్లు షాకైపోతున్నారు.
అప్పుడే ఇంటి నుంచి బయటకు వస్తాడు. ఎదురుగా రోడ్డుకు అవతల కాలేజ్ బస్సు వెళ్లడాన్ని చూసాడు. అంతే.. కాలేజ్ బస్సు ఎక్కడ మిస్ అయిపోతుందేమోనన్న భయంతో 17 ఏళ్ల విద్యార్ది పరుగు పెట్టి ఆ బస్సును అందుకోవాలని అనుకుంటాడు. కానీ ఇంతలోనే ఇటువైపు వస్తోన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఆ విద్యార్ధిని ఢీకొడుతుంది. ఒక్కసారిగా ఆ విద్యార్ధి రోడ్డుపై కుప్పకూలిపోతాడు. అలానే కొన్ని నిమిషాల పాటు రోడ్డుమీదే ఉండిపోతాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ పిల్లాడు బానే ఉన్నాడు కదా. చూసుకుని పరుగు పెట్టాలి కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రమాదంలో కాలేజ్ విద్యార్ది తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై పడి ఉన్న విద్యార్ధిని చూసి స్థానికులు 108 సాయంతో హాస్పిటల్‌లో చేరారు. అయితే బాలుడికి ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Caught on Cam | A teenager got severely injured while attempting to cross the road in haste to catch his college bus in Bengaluru. #Viral #ViralVideo #Bengaluru #Karnataka #Bus #Accident pic.twitter.com/z2PcA7XciN
— Guna Sekar (@GunaSekar689361) July 4, 2025

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



