Python Snake Viral Video: చూడగలిగితే గట్టి ధైర్యమే! గోడపై పాకుతున్న భారీ కొండచిలువ వీడియో వైరల్..!

Viral Video Giant Python Swiftly Climbs Wall Shocking Snake Video Trending Online
x

Python Snake Viral Video: చూడగలిగితే గట్టి ధైర్యమే! గోడపై పాకుతున్న భారీ కొండచిలువ వీడియో వైరల్..!

Highlights

Python Snake Viral Video: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ, షేర్ చేస్తూ గడిపేస్తున్నారు.

Python Snake Viral Video: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ, షేర్ చేస్తూ గడిపేస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ వీడియోలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. వైరల్ వీడియోలు చూడటమే కాదు, ఆసక్తికరమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడంలోనూ చాలా మంది ముందున్నారు.

తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతోంది. సాధారణంగా పాముల వీడియోలు చూస్తుంటే — ఎక్కువగా వాటిని రక్షించే సన్నివేశాలే కనిపిస్తాయి. కానీ ఈసారి ఒక భారీ కొండచిలువ మెట్ల పక్కనున్న గోడపై వేగంగా పాకుతూ పైకి ఎక్కుతోంది. ఆ స్పీడ్ చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. నిజంగా అద్భుతం అనిపించేలా ఆ సన్నివేశం ఉంది.

ఈ వీడియోను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్టు చేయగా, ఇప్పటికే వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది. పలు కామెంట్లు కూడా వచ్చాయి. కొంతమంది ఈ కొండచిలువ చాలా అరుదైన జాతికి చెందినదని, అత్యంత ప్రమాదకరంనని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి పాములు జనావాసాల్లోకి రాకపోయినా, ఈసారి ఓ ప్రత్యేక పరిస్థితుల్లో సంచరించినట్లు తెలుస్తోంది.

అంతేకాదు, ఈ పాముల జాతిలో కొన్ని ఆశ్చర్యంగా చాలా స్పీడ్‌గా కదిలే లక్షణం కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ వైరల్ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories