Viral Video: ఇంగ్లీష్‌లో దుమ్మురేపిన ఆటో రిక్షావాలా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Viral Video: అక్కడ ఫుల్ ట్రాఫిక్.. ఒక వాహనదారుడు ఒక ఆటో పక్కకొచ్చి.. ఎందుకు రాంగ్ రూట్‌లో పార్క్ చేశావు అని గట్టిగా ఇంగ్లీష్‌లో ఆటో డ్రైవర్‌‌తో మాట్లాడతాడు.

Indira Ram
Updated on: 1 July 2025 12:01 PM IST
Viral Auto Driver Speaks Fluent English Shocks Rider Video
X

Viral Video: ఇంగ్లీష్‌లో దుమ్మురేపిన ఆటో రిక్షావాలా.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో

Viral Video: అక్కడ ఫుల్ ట్రాఫిక్.. ఒక వాహనదారుడు ఒక ఆటో పక్కకొచ్చి.. ఎందుకు రాంగ్ రూట్‌లో పార్క్ చేశావు అని గట్టిగా ఇంగ్లీష్‌లో ఆటో డ్రైవర్‌‌తో మాట్లాడతాడు. అయితే..దీనికి సమాధానంగా ఆటో డ్రైవర్ నుంచి మౌనం వస్తాదని ఆ వాహనదారుడు ఆలోచించి ఉండొచ్చు. కానీ అతనికి ఊహించని షాక్ తగిలింది. ఆటో డ్రైవర్ అతని కంటే వేగంగా ఇంగ్లీష్‌లో టకటకా మాట్లాడడంతో ఆ వాహనదారుడు షాకైపోతాడు. కొన్ని సెకన్లపాటు అతనికి మాటలు రాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రోడ్డుపై వరసగా ఆటోలు ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకుని ఉంటాయి. దాని పక్కనుంచే టూ వీలర్స్ వస్తున్నాయి. అయితే టూవీలర్ మీద వచ్చిన ఒక వాహనదారుడు ఆటోల మధ్యలో ఉన్న ఒక ఆటో డ్రైవర్ పక్కకు వచ్చి... ‘ఎందుకు రాక్ రూట్‌లో మీ ఆటోలను పార్క్ చేశావు.. ’ అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ వెంటనే ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయి ఉంది. నేనే చిన్న చిన్న సందుల్లోంచి వచ్చాను..అంటూ అంతే గట్టిగా ఇంగ్లీష్‌లో టకాటకా మాట్లాడేస్తాడు. దీంతో టూవీలర్‌‌పై ఉన్న వ్యక్తి షాకైపోతాడు. కొన్ని సెకన్ల పాటు అతనికి మాటలు రావు. ఎందుకంటే ఆటోడ్రైవర్ ఇంగ్లీష్‌లో సమాధానం ఇస్తాడని అనుకోలేదు. కానీ, అతను అతనితో ధీటుగా ఇంగ్లీష్‌లో అదే వాయిస్‌తో మాట్లాడడంతో కాసేపు ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. ఆ తర్వాత మళ్లీ మాట్లాడతాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆటో డ్రైవర్ మాట్లాడిన తీరుపై నెటిజన్లు తెగ కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. అంకుల్ రాక్స్..దట్ బాయ్ షాక్స్ అంటూ కామెంట్లు చేశారు.


Indira Ram

Indira Ram

Next Story